ఇస్కాన్ లో కరోనా విజృంభణ ..ఆలయం మూత !

Tue Aug 11 2020 20:00:01 GMT+0530 (IST)

Pandemic boom in ISKCON?..Temple closure!

దేశంలో కరొనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలోనే యూపీలోని బృందావన్ లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ చైతన్య (ఇస్కాన్) ఆలయాన్ని శ్రీకృష్ణాష్టమికి సరిగ్గా ఒక్కరోజు ముందు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇస్కాన్ ఆలయ పూజారితో పాటు 22 మంది కరోనా మహమ్మారి బారిన పడడం తో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.పూర్తి వివరాలు చూస్తే . ఆలయంలో పనిచేసే వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. కాంటాక్టులను గుర్తించి పరీక్షలు చేయగా పూజారితోపాటు 22 మంది వైరస్ బారినపడినట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. బాధితులందరిని ఐసోలేషన్లో ఉంచామని ఆలయంలోకి ఎవ్వరూ రాకుండా నియంత్రిస్తున్నామని తెలిపారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడని విష్ణుమూర్తి ఎనిమిదో అవతారం అని నమ్ముతారు. హిందూ సంప్రదాయం ప్రకారం భాద్రపద మాసంలోని ఎనిమిదో రోజు వచ్చే అష్టమి తిథిని శ్రీకృష్ణాష్టమిగా జరుపుకోవడం ఆనవాయితి. భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు భోదించిన సందేశాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ గుర్తుచేస్తుందని పండితులు చెప్తారు.