మై హోం రామేశ్వర్ కు జాక్ పాట్.. !?

Mon May 23 2022 13:02:02 GMT+0530 (IST)

Interesting Update on My Home Rameshwar!

రాజ్యసభకు వెళ్లే పెద్దలకు సంబంధించి ఇంకా పేర్లు కొన్ని ఖరారు కాలేదు. కానీ మై హోం రామేశ్వర్ కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఆ విధంగా త్వరలో ఆయన జాక్ పాట్ కొట్టడం ఖాయం అని తెలుస్తోంది.తెలంగాణ నుంచి  రాజ్యసభకు వెళ్లే అవకాశాలు అయితే లేవు. పోనీ ఆంధ్రా నుంచి ఆయకు ఏమయినా అవకాశాలు ఉన్నాయా అంటే అవి కూడా నిల్.. ఆ డోర్లు కూడా క్లోజ్.. ఇప్పుడేం చేయాలి ? అందుకే ఆయన్ను బీజేపీ ఆకర్షిస్తోంది. రాజ్యసభ టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. ఇదే కనుక జరిగితే రామేశ్వర్ పంట పండినట్లే !

ఉత్తరప్రదేశ్ కోటాలో ఈ తెలంగాణ పెద్దాయనకు ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అన్నది ఓ యోచన. ఇప్పటికే కేసీఆర్ తో కొన్ని విభేదాదలు ఉన్నాయి కనుక ఆయన్ను తమ వైపుగా  తిప్పుకుని రాజ్యసభకు పంపే యోచన ఒకటి చేస్తే ఎలా ఉంటుంది అన్నది బీజేపీ ప్లాన్.

ఎలానూ ఎన్నికల వేళ పార్టీకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసే మనిషే కనుక ఈ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఆలోచిస్తోంది బీజేపీ.

మరోవైపు రామేశ్వర్ కు ఎంపీ టికెట్ దక్కితే చినజియరు స్వామీజీకి కేసీఆర్ కు ఉన్న వైరం మళ్లీ మళ్లీ పెరిగిపోవడం ఖాయం. దాంతో మై హోం సంస్థలపై కక్ష సాధింపు చర్యలు తీసుకునే అవకాశాలూ ఉన్నాయి.

అందుకే పదవి ముఖ్యమా.. ఆస్తులు ముఖ్యమా ? అన్నది కూడా ఓ సందిగ్ధమే ఆయనకు ! ఈ దశలో ఎంపీ పదవి వచ్చినా అది ఆయనకు ఓ  విధంగా గొంతు మీద కత్తి లాంటిదే అన్నది ఓ వాదన వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్స్ లో !