Begin typing your search above and press return to search.

అన్ని రకాల లోన్స్ పై వడ్డీ పై వడ్డీ మాఫీ !

By:  Tupaki Desk   |   20 Oct 2020 1:10 PM GMT
అన్ని రకాల లోన్స్ పై వడ్డీ పై వడ్డీ మాఫీ !
X
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకువచ్చింది. ఆ సమయంలో సరైన ఉపాధి లేక కొందరు, సరైన తిండి లేక మరికొందరు , ఇంకా పలు కారణాలతో అనేక మంది నానా అవస్థలు పడ్డారు. దీనితో ఆ సమయంలో ప్రతి ఒక్కరి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అన్ని రుణాలపై కేంద్రం మారటోరియం విధించింది. ఆ మారటోరియం గడువు ఆగస్టు 31 తో ముగిసింది. ఆ తరువాతే అసలు వ్యవహారం మొదలైంది. లోన్ మారటోరియం ఉపయోగించిన వారికి వడ్డీ కి వడ్డీ కట్టాలంటూ బ్యాంకులు రుణ గ్రస్తులకి షాక్ ఇచ్చాయి. దీనితో ఈ సమస్య పై పలువురు సుప్రీం ను ఆశ్రయించారు. దీనిపై సుప్రీం లో అనేక దఫాలుగా వాదనలు వినిపించాయి. ఈ కేసు వ్యవహారం ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది.

ఇక , మారటోరియం సమయంలో ఎక్కువమంది ఈఎంఐలను చెల్లించలేదు. కొందరు చెల్లించగలిగారు. ఆరునెలలు మారటోరియం ఉపయోగించిన వారితో పాటు ఆరు నెలలు ఈఎంఐలను చెల్లించిన వారికి కూడా వడ్డీ మినహాయింపు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. రూ. 2 కోట్లలోపు వ్యక్తిగత, గృహరుణాలను తీసుకుని ఈఎంఐ సమయానికి చెల్లించిన రుణగ్రహీతల వడ్డీపై వడ్డీని మాఫీ చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. నిపుణుల సూచనల ప్రకారం.. ఈ మినహాయింపును ఆరు నెలల కాలానికి అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రుణాలకు సంబంధించి వడ్డీపై వడ్డీని మాఫీ చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే , బ్యాంకులకు ఏర్పడే నష్టాన్ని కేంద్రం భరించింది.