పుట్టమధుః రూ.2 కోట్లపై విచారణ?

Mon May 10 2021 06:00:02 GMT+0530 (IST)

Inquiry into Putta Madhu  Rs 2 crore

పెద్దపల్లి జడ్పీ చైర్మన్ టీఆర్ఎస్ నాయకుడు పుట్ట మధును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో శనివారం మధును అదుపులోకి తీసుకున్నారు. దాదాపు మూడు నెలల క్రితం న్యాయవాదులైన వామనరావు దంపతుల హత్యకేసు విషయమై పుట్టమధును పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం.కాగా.. రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కీలకమైన పాయింట్ ను లాగుతున్నట్టు సమాచారం. వామనరావు దంపతుల హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు పుట్టా మధు రూ.2 కోట్లను బ్యాంక్ నుంచి డ్రా చేశారట. ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

హత్యకేసు నిందితుడు కుంట శ్రీనివాస్ జైల్లో ఉండగా.. ఆయన ఇంటి నిర్మాణం మాత్రం శరవేగంగా కొనసాగుతుండడంపైనా పోలీసులు ఆరాతీస్తున్నట్టు సమాచారం. లాయర్ వామనరావు దంపతులు పుట్ట మధుపై కేసులు వేసిన విషయం తెలిసిందే. అజ్ఞాతంలోకి వెళ్లిన సమయంలో మధు నాలుగు రాష్ట్రాల్లో నాలుగు వాహనాలను మార్చాడని 6 ఫోన్లు మార్చాడని పోలీసులు వెల్లడించినట్టు సమాచారం.