కరోనా భయం: ఇరాన్ జైలు నుంచి ఖైదీల పరార్.. వీడియో

Sun Mar 29 2020 00:00:01 GMT+0530 (IST)

Corona Scare Video: Inmates Escaping The Prison In Iran

ఇరాన్ లో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. వందలాది మంది చనిపోయారు. చైనా తర్వాత ఇటలీ ఇరాన్ లోనే ఎక్కువ కేసులు వెలుగుచూశాయి. అయితే ఇరాన్ లో జైళ్లలో ఉన్న ఖైదీలు సైతం కరోనా సోకుతుందని భయపడ్డారు. జైలు నుంచి తాజాగా వారంతా ఊరుకులు పరుగుల తో తప్పించుకున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది.ఇరాన్ లో కరోనా విజృంభిస్తోంది. ఏకంగా 32322మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. చాలా మంది ప్రాణాలు పోవడంతో ఇరాన్ మార్చి మొదటివారం లో జైళ్లలో ఉన్న దాదాపు 80వేల మంది ఖైదీలను విడుదల చేసింది.

తాజాగా ఇరాన్ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు కరోనా భయంతో జైలు నుంచి తప్పించుకున్నారు. ఈ వీడియోను ఒకరు వీడియో తీసి పెట్టడంతో వైరల్ అయ్యింది. తప్పించుకున్న వారిలో చాలా మందికి వైరస్ సోకినట్టు తేలడంతో ఖైదీలంతా మూకుమ్మడిగా జైలు నుంచి ఇలా జంప్ అయ్యారని తెలిసింది.

ఖైదీలంతా ప్రాణభయంతో జైలు నుంచి తప్పించుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఎంతమంది తప్పించుకున్నారు? ఇందులో ఎవరెవరి హస్తం ఉందనే దానిపై ఇరాన్ ప్రభుత్వం ఆరాతీస్తోంది.


వీడియో కోసం క్లిక్ చేయండి