Begin typing your search above and press return to search.

వారి పెళ్లి కోసం అంతర్జాతీయ వంతెనను ఓపెన్ చేసిన ఇండో-నేపాల్ ప్రభుత్వం !

By:  Tupaki Desk   |   15 July 2020 11:30 PM GMT
వారి పెళ్లి కోసం అంతర్జాతీయ వంతెనను ఓపెన్ చేసిన ఇండో-నేపాల్ ప్రభుత్వం !
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచంలోని ప్రతి దేశం కూడా భయంతో వణికిపోతోంది. కరోనా దెబ్బకి చాలా దేశాలు లాక్ డౌన్ ను విధించాయి. దీనితో అనేకమంది ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా ఈ కరోనా లాక్ డౌన్ కారణంగా అనేక పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి, పెళ్లిళ్లకి అనుమతి ఇవ్వకపోవడం అలాగే అతికొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిబంధనలు పెట్టడంతో చాలామంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు.

అయితే , ఈ పరిస్థితుల్లోనే ఓ జంట‌ వివాహంతో ఒక్క‌ట‌య్యేందుకు ఇండో-నేపాల్ పరిపాలనా యంత్రాంగాలు 15 నిమిషాల పాటు అంతర్జాతీయ వంతెనను తెరిచాయి. పెళ్లి ఊరేగింపు లేకుండానే వరుడు త‌న తండ్రితో కలిసి నేపాల్‌లోని దర్చులాలో జ‌రిగే త‌మ వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యాడు. సాధార‌ణంగా హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుక ఐదారు గంటల పాటు జరుగుతుంది. అయితే వీరి వివాహం కేవలం 12 నిమిషాల్లో ముగిసింది. నేపాల్ పరిపాలనా విభాగం అనుమ‌తితో భార‌త్‌ లోని పిథోరాగఢ్‌ కు చెందిన కమలేష్ చంద్ త‌న వివాహం కోసం నేపాల్ ‌లోని దర్చులాకు చేరుకున్నాడు.ఈ పెళ్లికి వరుడు, అతని తండ్రి మాత్రమే హాజరయ్యారు. ప్ర‌భుత్వ అనుమ‌తి మేర‌కు 15 నిముషాల పాటు ఝూలాపూల్ తెరిచారు. ద‌ర్చులాలో వ‌రుడు, వ‌ధువు దండ‌లు మార్చుకున్నారు. వెంట‌నే ఆ కొత్త దంప‌తులు భార‌త్‌ కు తిరిగి వ‌చ్చారు. మాములుగా అయితే వీరి పెళ్లి బంధువుల సమక్షంలో మార్చి 22న జరగాలి , కానీ , కరోనా లాక్ డౌన్ కార‌ణంగా అప్పుడు పెళ్లిని వాయిదా వేసుకున్నారు.