Begin typing your search above and press return to search.

లండన్ బాట పట్టిన భారతీయులు .. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   5 Dec 2020 7:19 AM GMT
లండన్ బాట పట్టిన భారతీయులు .. ఎందుకంటే ?
X
ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తున్న కరోనాను అంతం చేయడానికి ఇప్పటికే పలు సంస్థలు వ్యాక్సిన్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆక్స్ఫర్డ్, ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనకా వంటి ఫార్మా దిగ్గజాలు చివరి దశ ప్రయత్నాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ టీకాను కరోనా వారియర్స్ గా గుర్తింపు పొందిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు అందజేయాలని దాదాపు అన్ని దేశాలు ఓ పక్కా ప్రణాళికల్ని వేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో బ్రిటన్ లో వచ్చే వారం నుంచి వ్యాక్సిన్ కు సంబంధించి సరఫరా చేయనున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇండియన్స్ చాలా మంది లండన్ కు వెళ్లడానికి రెడీ అవుతున్నారట. పలు ట్రావెల్ ఏజెన్సీలు ఇందుకోసం ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని ఆఫర్ చేస్తున్నాయట. దాదాపు 20 మిలియ‌న్ల మందికి రెండు డోసేజ్ లుగా వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి వీలుగా మార్కెట్లోకి కరోనా విరుగుడు వ్యాక్సిన్ ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంద‌ట యూకే ప్ర‌భుత్వం. అక్క‌డి జ‌నాభాతో పోలిస్తే 20 మిలియ‌న్ల మంది అంటే, త‌క్కువ మందికే వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తున్న‌ట్టు.

. దీనిపై ముంబయికి చెందిన ఒక ట్రావెల్ ఏజెన్సీ స్పందిస్తూ.. యూకే కు వెళ్లే వారి కోసం మూడు రోజుల ట్రిప్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఇప్పటికే తమ సంస్థకు పలువురు వినియోగదారుల నుంచి ఆఫర్లు వస్తున్నాయని.. అయితే దీనిమీద త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక ఇదే విషయమై EaseMyTrip సహ వ్యవస్థాపకుడు నిషాంత్ పిట్టి స్పందిస్తూ... లండన్ కు వెళ్లడానికి ఇది సరైన సీజన్ కాకున్నా అక్కడకు వెళ్లడానికి పలువురు ఆసక్తి చూపుతున్న మాట వాస్తవమే అన్నారు. అయితే ఇది చాలా తొందరపాటు చర్యే అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడి నుంచి వెళ్లే భారతీయులకు యూకే లో కరోనా వ్యాక్సిన్ ఇస్తారా..? లేదా.. అనేది ఇంకా తెలియాలని అన్నారు. విదేశీయులకు టీకా అందిస్తామని ఆ దేశం కూడా ఇప్పటిదాకా అధికారిక ప్రకటన చేయలేదని తెలిపారు. ఏ దేశంలో అయినా ముందుగా ఆ దేశ పౌరులకు ఇచ్చిన తర్వాతనే మిగతా వారికి వ్యాక్సిన్ అందజేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.