ఇన్ స్టాకు తెలియని లోపాన్ని ఎత్తి చూపిన మనోడు.. కట్ చేస్తే.. భారీ నజరానా

Thu Jun 17 2021 09:00:37 GMT+0530 (IST)

Indian hacker wins Rs 22 lakh from Facebook

ఇప్పుడు నడుస్తున్నదంతా టెక్నాలజీ యుగం. ఈ డిజిటల్ ప్రపంచంలో అవకాశాలు వాటికవే వచ్చే కన్నా.. వాటిని దక్కించుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచాన్ని శాసిస్తున్న సోషల్ మీడియాలోని సాంకేతిక లోపాల్ని ఎత్తి చూపిస్తూ కొందరు నిపుణులు తమ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంటారు. తాజాగా అలాంటి లోపాన్ని ఎత్తి చూపించి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాను సర్ ప్రైజ్ చేశాడు షోలాపూర్ కు చెందిన కుర్రాడు. ఇంతకూ ఆ బగ్ ఏమిటి? అందుకు ఇన్ స్టా ఎలా రియాక్టు అయ్యింది? అన్న విషయాల్లోకి వెళితే..షోలాపూర్ కు చెందిన మయూర్ అనే కుర్రాడు ఇన్ స్టాలోని ఒక బగ్ ను గుర్తించాడు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ కు తెలియజేశాడు. దీంతో స్పందించిన ఫేస్ బుక్ ఇన్ స్టాలో అతను చెప్పిన లోపాన్ని నిరూపించాలని కోరింది. అందుకు తగిన ఆధారాల్ని ఫేస్ బుక్ కు అందజేశాడు మయూర్. దీంతో..క్రాస్ చెక్ చేసిన ఫేస్.. మనోడు చెప్పిన లోపం ఉందన్న విషయాన్ని గుర్తించింది.

ఇంతకూ మయూర్ ఎత్తి చూపిన బగ్ ఏమంటే.. ఇన్ స్టాలో యూజర్ తన అకౌంట్లో ప్రైవసీ కోసం అకౌంట్ ను ప్రైవేటుగా మార్చుకుంటారు. అయితే.. సాంకేతికంగా ఉన్న లోపం కారణంగా ఇన్ స్టాలో ప్రైవేటు అకౌంట్ లో ఉన్న యూజర్ అర్కవైడ్ పోస్టులు.. స్టోరీస్.. రీల్స్ వీడియోల్ని చూసేలా ఉందని పేర్కొన్నారు.

ఈ లోపం కారణంగా యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. దీన్ని చెక్ చేసిన ఫేస్ బుక్ అతను చెప్పిన దాన్లో నిజం ఉందని గ్రహించింది. అందుకే.. అతని ప్రతిభకు మెచ్చి 30వేల డాలర్లను నజరానాగా ప్రకటించింది. మనరూపాయిల్లో ఇది రూ.22 లక్షలకు సమానం. భారీ నజరానా మాత్రమేకాదు మనోడి ప్రతిభ బయట ప్రపంచానికి తెలిసినట్లైందని చెప్పాలి.