Begin typing your search above and press return to search.

పరమ శివుడి కోసం ఆ రైల్లో బెర్తు కేటాయింపు

By:  Tupaki Desk   |   17 Feb 2020 8:00 AM GMT
పరమ శివుడి కోసం ఆ రైల్లో బెర్తు కేటాయింపు
X
వినేందుు విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. తాజాగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఒక రైల్లో పరమశివుడి కోసం ఒక బెర్తును కేటాయించిన వైనం ఆసక్తి కరంగా మారింది. ఇంతకీ ఆ ట్రైన్ ఏమిటి? అలా ఎందుకు వదిలారు? అన్నది చూస్తే.. ఆసక్తికర సమాచారం బయటకు వస్తుంది.

మూడు జ్యోతిర్లాంగాలను కలిపేలా వారణాసి - ఇండోర్ మధ్య కొత్తగా ఒక ట్రైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన వైనం తెలిసిందే. దీనికి కాశీ మహాకాళ్ ఎక్స్ ప్రెస్ అనే పేరు పెట్టారు. ఈ ట్రైన్లో పరమశివుడికి ఒక బెర్తును కేటాయించారు. ఈ ట్రైన్ లో మరో ప్రత్యేకమైన ఫీచర్ ఏమంటే.. పూర్తి శాఖాహారాన్ని మాత్రమే అందిస్తారు. అంతేకాదు.. పూర్తిగా ఏసీ బోగీలే ఉంటాయి. అంతేకాదు.. చాలా తక్కువ ట్రైన్లో ఉండే.. వ్యక్తిగత సహాయకుల సౌకర్యం కూడా ఉంది.

ఈ ట్రైన్ లో ఒక బెర్తును శివుడి కోసం కేటాయించారు. ఈ బెర్తు మీద ఆలయ చిత్రాన్ని ఏర్పాటు చేస్తారు. రైల్లోని బి5లో 64వ నెంబరు బెర్తును పరమశివుడు కోసం కేటాయించారు. దీన్ని మరెవరికీ ఇవ్వరు. శాశ్వితంగా ఈ బెర్తును శివుడి కోసం అలానే ఉంచేయాలన్న ఆలోచనలో రైల్వేశాఖ ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి కనిపించని దేవుడి కోసం రైల్లో ఒక బెర్తును శాశ్విత ప్రాతిపదికన ఉంచేయటం భారతీయ రైల్వే (అదే ఐఆర్ సీటీసీ)కు మాత్రమే చెల్లుతుందేమో?