Begin typing your search above and press return to search.

అమెరికా ఉపాధ్యక్ష పదవి బరిలో భారత సంతతి వ్యక్తి

By:  Tupaki Desk   |   12 Aug 2020 6:50 AM GMT
అమెరికా ఉపాధ్యక్ష పదవి బరిలో భారత సంతతి వ్యక్తి
X
అమెరికాలో భారతీయులు, భారతీయ సంతతి వ్యక్తులు కీలక వ్యాపారాల్లోనే కాకుండా అక్కడి ప్రభుత్వాల్లో కూడా ఎంతో మంది కీలక పాతర్ పోషిస్తున్నారు. భారతీయులు లేని అమెరికాను ఊహించుకునే పరిస్థితులు ఇపుడు లేవు. అందుకే ఎపుడు ఎన్నికలు వచ్చినా అధ్యక్ష అభ్యర్థుల బృందాల్లో భారతీయ సంతతి వారు కచ్చితంగా ఉంటారు. అయితే, మరో కీలక పరిణామమం జరిగింది. రాబోయే ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్ష పదవికి భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది డెమొక్రటిక్ పార్థి. ప్రస్తుత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ గతంలో ఉపాధ్యక్షుడిగా చేసిన వారే. అంటే అంటే భారతీయులు ఎంత కీలక స్థానం ఆక్రమిస్తున్నారో అర్థమవుతోంది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారతీయ సంతతికి చెందిన ఓ మహిళ అగ్రరాజ్యం ఉపాధ్యక్ష పదవికి పోటీ పడటం ఇదే మొదటి సారి.

ఇదిలాఉండగా.. అమెరికా ఉపాధ్యక్ష పదవికి శ్వేతజాతీయులు తప్ప ఇంతవరకు ఇతరులు ఎవరూ పోటీపడేలదు. ఒక ఆసియన్, అమెరికాయేతర మహిళ ఆ పదవికి పోటీపడటం ఇది తొలిసారి. ప్రస్తుతం ఆమె కాలిఫోర్నియా నుంచి సెనెట్‌కు ఎంపిక అయ్యారు. ఈ పదవి సాధించిన తొలి ఇండియన్ అమెరికన్‌గా ఆమెపై రికార్డు ఉంది. కమలా హ్యారిస్ పూర్వీకులు తమిళనాడుకు చెందినవారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ సొంతూరు చెన్నై. పెళ్లికి ముందే అమెరికా వెళ్లి అక్కడే డాక్టరుగా సెటిలయ్యారు. జమైకాకు చెందిన హ్యారిస్‌ను పెళ్లాడారు. వారి కూతురే కమలాహ్యారిస్.

1964 న జన్మించిన 55 ఏళ్ల కమల న్యాయవాద వృత్తిలో ఉన్నారు. 2003లో శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా విజయం సాధించారు. రాజకీయాల్లో కొనసాగుతూ 2016 అమెరికా ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి సెనెటర్ గా గెలుపొందారు. ఈ సారి ఏకంగా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఇపుడు డెమొక్రాట్స్ దే విజయం అని సర్వేలు చెబుతుండటంతో ఆమె గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే... 2024లో ఆమె అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశం లేకపోలేదు. అయితే, ఇపుడు జోబిడెన్ గెలిస్తే ఆయన అప్పటికీ ఆరోగ్యంగా ఉంటే... కమలా హ్యారిస్ కు 2028 లోనే మళ్లీ ఆ అవకాశం దక్కేది.

వాస్తవానికి అత్యధిక సంఖ్యలో ఉన్న అమెరికాయేతర ఓటర్లు భారతీయులు. అందుకే వ్యూహాత్మకంగా ఆమెను ఎంపిక చేశారని అర్థమవుతుంది. ఉపాధ్యక్ష పదవికి ఎంపికైనంత సులువుగా అధ్యక్ష పదవికి ఇక విదేశీ వ్యక్తిని ఎంపిక చేస్తారనుకోవడం అత్యాశే. అయితే డెమొక్రాట్స్ ఎపుడూ వర్ణవివక్షకు వ్యతిరేకం. డెమొక్రాట్స్ వల్లే బరాక్ ఒబామా అధ్యక్ష పదవి అలంకరించారు. కాబట్టి ఏదైనా జరగొచ్చు. చెప్పలేం. కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష పదవి కోసం ఎంపిక చేయడం పట్ల ప్రవాస భారతీయుల్లో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతోంది.