టాప్-5 లోకి దూసుకెళ్లిన భారత్: కొత్తగా 9971 పాజిటివ్ - 287 మృతి

Sun Jun 07 2020 11:33:08 GMT+0530 (IST)

India in Top 5 Countries Affected with New Dangerous Disease

మహమ్మారి వైరస్ విషయంలో భారతదేశం రికార్డులు సృష్టిస్తోంది. అభివృద్ధి సంక్షేమంలో టాప్ లో నిలవకున్నా వైరస్ విషయంలో మాత్రం ప్రపంచ దేశాలతో పోటీ పడి నంబర్ స్థానానికి ఎగబాకేలా ఉంది. తాజాగా ఒక్కరోజే దాదాపు పదివేలకు చేరువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 9971 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం ప్రకటించింది. ఒక్కరోజులో  287 మృతి చెందారు. తాజా వాటితో కలిపి మొత్తం కేసులు 246628కి చేరుకోగా - మొత్తం మరణాలు 6929కి చేరాయి. తాజా కేసులతో ఇప్పటివరకు ప్రపంచంలో ఐదో స్థానానికి భారత్ చేరుకుంది. స్పెయిన్ ను దాటేసి ఒకడుగు పైకి ఎక్కింది. కేసుల విషయంలో త్వరలోనే అమెరికా సరసన చేరేలా పరిస్థితి ఉంది.వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 119293గా ఉంది. ప్రస్తుతం దేశంలో 120406 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన టెస్టుల సంఖ్య 4666386గా ఉందని కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా వైరస్ కేసులు 6974721కి చేరుకున్నాయి. వీటిలో యాక్టివ్ కేసులు 3161346 ఉన్నాయి. మృతులు 402094 మంది ఉన్నారు.

కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా టాప్ లో ఉన్న దేశాలు

అమెరికా  1988544
బ్రెజిల్      676494
రష్యా       458689
స్పెయిన్   288390
లండన్ (యూకే)  284868