Begin typing your search above and press return to search.

దావూద్ కంపెనీకి పాక్ అందలం పై భారత్ ఫైర్

By:  Tupaki Desk   |   19 Jan 2022 7:02 AM GMT
దావూద్ కంపెనీకి పాక్ అందలం పై భారత్ ఫైర్
X
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ పై మరోసారి భారత్ విరుచుకుపడింది. దావూద్ కంపెనీ ముఠాకు ఆ దేశం ఫైవ్ స్టార్ సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ఆరోపించింది. 19993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న వారికి పాకిస్తాన్ రక్షణ కల్పిస్తున్నట్టు ఇండియా పేర్కొన్నది.

దావూద్ ఇబ్రహీంకు చెందిన వర్గానికి పాకిస్తాన్ లో ఫైవ్ స్టార్ ఆతిథ్యం కల్పిస్తున్నట్టు భారత్ వెల్లడించింది. భారత శాశ్వత ప్రతినిధి, అంబాసిడర్ టీఎస్ తిరుమూర్తి ఐక్యరాజ్యసమితిలో ఈ ఆరోపణలు చేశారు.

ఇంటర్నేషనల్ కౌంటర్ టెర్రరిజం కాన్ఫరెన్స్ 2022లో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదం.. వ్యవస్థీకృత నేరాల మధ్య లింకులను గుర్తించి సరైన రీతిలో చర్యలు తీసుకోవాలని తిరుమూర్తి సూచించారు.

1993 ముంబై పేలుళ్ల నిందితులు సిండికేట్ నేరాలకు పాల్పడ్డారని.. వాళ్లకు పాకిస్తాన్ రక్షణ ఇవ్వడమే కాకుండా.. ఫైవ్ స్టార్ ఆతిథ్యం ఇస్తోందని ఆయన ఆరోపించారు.

అయితే దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నట్లు 2020 ఆగస్టులో పాకిస్తాన్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఉగ్రవాద సంస్థలకు నిధుల మళ్లింపును అడ్డుకోవాలని ఐక్యరాజ్యసమితిలో కోరారు.