Begin typing your search above and press return to search.

మనోళ్లు అంత తెలివైనోళ్లు కారా? ఆ మాట అన్నదెవరంటే?

By:  Tupaki Desk   |   21 Nov 2019 1:30 AM GMT
మనోళ్లు అంత తెలివైనోళ్లు కారా? ఆ మాట అన్నదెవరంటే?
X
సంపద విషయంలోనూ.. వనరుల విషయంలోనూ భారత్ తిరగులేని స్థానంలో ఉన్నప్పటికీ.. రాజకీయంగా ఉన్న పరిస్థితులు దేశాన్ని తిరోగమనం చెందేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు. అన్నింటికి మించిన ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో జీవన ప్రమానాలు చాలా దిగజారిన పరిస్థితిలో ఉన్న విషయం తాజాగా నిర్వహించిన సర్వే వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా 63 దేశాలతో కూడిన ఒక నివేదిక తాజాగా విడుదలైంది. జీవనప్రమాణాలతో పాటు.. విద్యారంగంపై పెడుతున్న ఖర్చు విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. ప్రపంచంలోని 63 దేశాలతో పోలిస్తే విద్యా రంగంలో భారత్ చేస్తున్న ఖర్చును ప్రస్తావించారు.

సర్వేలో తీసుకున్న 63 దేశాల్లో భారత్ 59వ స్థానంలో ఉన్నట్లు తేల్చారు. ఈ నివేదికలో స్విట్జర్లాండ్ తొలిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో డెన్మార్క్.. మూడో స్థానంలో స్వీడన్.. నాలుగో స్థానంలో ఆస్ట్రియా.. ఐదో స్థానంలో లక్సెంబర్గ్ ఉన్నట్లు తేల్చారు.

ఐస్ ల్యాండ్.. ఫిన్ ల్యాండ్.. నెదర్లాండ్స్..సింగపూర్ లాంటి దేశాలు టాప్ టెన్ జాబితాలో ఉన్నాయి. పెట్టుబడుల అభివృద్ది.. సమస్యలపై తక్షణంగా స్పందించే గుణాలకు సంబంధించిన విభాగాల ఆధారంగా చేసుకొని ఈ ర్యాంకింగ్స్ ను నిర్ణయించారు.

విషాదకరమైన విషయం ఏమంటే బ్రిక్స్ దేశాలైన చైనా.. రష్యా.. దక్షిణాఫ్రికాలతో పోల్చినా ఇండియా ఈ విషయంలో వెనుకబడి ఉండటం. ఇదిలా ఉంటే భారత ప్రజలు అంత తేలివైనవారుకాదని.. ఆర్థిక మాంద్యంతో పాటు టాలెంట్ ను ఆకర్షించే విషయంలో ఇండియా పక్కచూపులు చూస్తోందని సర్వే వెల్లడించింది.

ఇక.. ఈ నివేదిక ప్రకారం చైనా 42వ స్థానంలో ఉంటే రష్యా 47వ స్థానంలో సౌతాఫ్రికా 50వ స్థానంలో ఉంది. భారతదేశంలో విద్యపై పెట్టే ఖర్చు చాలా తక్కువగా ఉందని.. ఒక్కో విద్యార్థిపై పెట్టే ఖర్చు తక్కువగా ఉండటంతో నాసిరకం విద్యా ప్రమాణాలకు కారణంగా చెబుతున్నారు. అంతేకాదు.. జీడీపీ వృద్దిపైనా దీని ప్రభావం తీవ్రంగా ఉందని నివేదిక పేర్కొంది. ఈ నివేదికను ఐఎండీ బిజినెస్ స్కూల్ తయారు చేయగా.. సీనియర్ ఆర్థిక వేత్త జోస్ కెబల్లెరో జరిపిన అధ్యయనం ఈ విషయాల్ని వెల్లడించింది.