Begin typing your search above and press return to search.

అవి ఆడవారికే కాదు మగవారికి కూడానా..ఏంటంటే?

By:  Tupaki Desk   |   19 Nov 2019 8:37 AM GMT
అవి ఆడవారికే కాదు మగవారికి కూడానా..ఏంటంటే?
X
సాధారణంగా ఈ సృష్టిలో కొన్ని ఆడవారు మాత్రమే చేయగలిగితే ..కొన్ని మగవారు మాత్రమే చేయగలుగుతారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సమానమే అని చెప్పినప్పటికీ ఎవరికీ ఉన్న పరిమితులు వారికి ఉన్నాయి. మగవారికి - ఆడవారికి కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వారు చేసే కొన్ని పనులు వీరు ..వీరు చేసే కొన్ని పనులు వారు చేయలేరు. ఇక పిల్లల విషయానికొస్తే .. పురుషుడు స్త్రీతో లైంగికంగా కలిసినప్పుడే ఆ స్త్రీ గర్భం దాలుస్తుంది. ఇది సృష్టి ధర్మం.

ఇక పిల్లలు చాలు అని అనుకున్నప్పుడు సాధారణంగా మహిళలు ట్యూబెక్టమీ చేయించుకుంటారు. ఈ ప్రపంచంలో ఎక్కువగా మహిళలే ట్యూబెక్టమీ చేయించుకుంటున్నారనేది వాస్తవం. భవిష్యత్తులో పిల్లలు వద్దనుకుంటే ట్యూబెక్టమీనే ప్రిఫర్ చేస్తారు. దీంతో పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. ఇక పురుషులకు వ్యాసెక్టమీ ఆపరేషన్ నిర్వహిస్తారు. ఇది కూడా కుటుంబనియంత్రణలో భాగమే. వీటన్నిటికీ చెక్ పెడుతూ వ్యాసెక్టమీ స్థానంలో ఒక చిన్న ఇంజెక్షన్‌‌ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కనిపెట్టింది. వ్యాసెక్టమీ ఆపరేషన్ స్థానంలో పురుషులకు ఒక గర్భనిరోధక ఇంజెక్షన్ ఇస్తే చాలు - వారు లైంగికంగా మరో మహిళతో కలిసినప్పుడు ఆమె గర్భం దాల్చదని చెబుతున్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వైద్యులు. ఈ మేరకు వారు ఓ ఇంజెక్షన్‌ ను కనిపెట్టారు. ఇది ప్రపంచంలోని తొలి గర్భనిరోధక ఇంజెక్షన్ అని తెలిపారు.

గర్భనిరోధక ఇంజెక్షన్‌ కు సంబంధించి ఇప్పటికే అన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు ఈ ప్రాజెక్టు అధినేత డాక్టర్ ఆర్ ఎస్ శర్మ చెప్పారు. ప్రస్తుతం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్రకోసం పంపినట్లు శర్మ తెలిపారు. ఒక్కసారి ఇంజెక్షన్ వేశామంటే 13 ఏళ్ల పాటు ఇది పనిచేస్తుందని వెల్లడించారు. ఇక గర్భనిరోధక ఇంజెక్షన్లపై అమెరికా కూడా ప్రయత్నాలు సాగిస్తుండగా ఇంకా అవి ప్రయోగం దశలోనే ఉన్నాయి. దీంతో పురుషుల్లో గర్భనిరోధక ఇంజెక్షన్ కనిపెట్టిన తొలిదేశంగా భారత్ నిలిచినట్లు అయ్యింది. అయితే డ్రగ్ కంట్రోలర్ నుంచి ఆమోదముద్ర పడగానే భారత్ ఇంజెక్షన్ కనిపెట్టిన తొలిదేశంగా నిలుస్తుంది.

ఇక ఈ ఉత్పత్తిని విడుదల చేసే ముందు చాలా అప్రూవల్స్ రావాల్సి ఉందని ఇందుకు ఏడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు డ్రగ్ కంట్రోలర్. ఎందుకంటే ఇలాంటి బృహత్తరమైన ప్రాడక్ట్ విడుదల చేసేముందు అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని పరిశీలనలు చేశాకే ఆమోద ముద్రవేస్తామని ఆయన చెప్పారు. ఇక గర్భనిరోధక ఇంజెక్షన్ వస్తే పురుషులు చాలా లాభపడతారని డాక్టర్లు నిపుణులు చెబుతున్నారు. ఆపరేషన్‌ కంటే ఇంజెక్షన్‌ తోనే చాలా లాభాలు ఉంటాయని వెల్లడించారు.