Begin typing your search above and press return to search.

దాడికి అటు చైనా..ఇటు పాక్.. ఆర్మీ కీలకప్రకటన

By:  Tupaki Desk   |   1 Jun 2020 9:10 AM GMT
దాడికి అటు చైనా..ఇటు పాక్.. ఆర్మీ కీలకప్రకటన
X
అటువైపు పాకిస్తాన్.. ఇటు చైనా దేశ కశ్మీర్ సరిహద్దుల్లో కయ్యానికి కాలుదూస్తున్నాయి. మన బార్డర్లో చైనా భారీగా సైన్యాన్ని పోగుచేస్తూ యుద్ధ సంకేతాలు పంపుతోంది. ఇటుపక్క పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పాకిస్తాన్ భారీగా టెర్రరిస్టులకు శిక్షణ ఇస్తూ భారత్ పైకి ఉసిగొల్పుతోంది. దీంతో దీనిపై భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది.

ఈ జూన్ నెల కశ్మీర్ లో వేసవి. మంచు అంతా కరిగిపోయి కొండలు తేలుతాయి. అందుకే ఈ వేసవిలో టెర్రరిస్టుల చొరబాటుకు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే పాకిస్తాన్ భారీగా ఉగ్రవాదులను భారత్ లోకి పంపేందుకు పీవోకేలో ఉగ్రశిబిరాలను భారీగా నిర్వహిస్తోంది. ఇందులో టెర్రరిస్టులు కిక్కిరిసిపోయి ఉన్నారని.. రాబోయే రెండు నెలలు చొరబాట్లు అధికంగా ఉండొచ్చని అంటున్నారు. 15 లాంచ్ ప్యాడ్లలో టెర్రరిస్టులు రెడీగా ఉన్నట్లు సమాచారం.

దీంతో తాజాగా భారత లెప్టినెంట్ జనరల్ రాజు ప్రకటన చేశారు. ఒక్క టెర్రరిస్టును కూడా భారత గడ్డపై అడుగు పెట్టనీయకుండా చర్యలు తీసుకున్నామని.. బలగాలను భారీగా మోహరించామని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివే స్తామని స్పష్టం చేశారు.

జమ్మూ కశ్మీర్ ను విభజించి భారత్ లో పూర్తిగా విలీనం చేసిన తర్వాత పాకిస్తాన్ ఉడికిపోతోంది. శాంతి, స్వతంత్రాలు వెల్లివిరుస్తున్న వేళ మళ్లీ అశాంతిని చెలరేగగొట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. చైనా భారీగా మోహరించి పాకిస్తాన్ కు సహకారం అందిస్తోందని.. పాకిస్తాన్ ఉగ్రవాదులను దీన్ని ఆధారంగా భారత్ లోకి ఎగదోస్తోందని భారత అనుమానాలు వ్యక్తం చేస్తోంది.