Begin typing your search above and press return to search.

లఢక్ లో మళ్లీ చైనా మోహరింపు.. భారత్ అలెర్ట్

By:  Tupaki Desk   |   9 Jun 2021 8:30 AM GMT
లఢక్ లో మళ్లీ చైనా మోహరింపు.. భారత్ అలెర్ట్
X
తూర్పు లఢక్ లో చైనా ఆగడాలు మరోసారి పెచ్చుమీరాయి. ఇప్పటికే ఆ స్థానాన్ని ఖాళీ చేసి వెనక్కి వెళ్లిన చైనా తాజాగా మరోసారి తూర్పు లఢక్ లో అలజడి రేపింది. తాజాగా యుద్ధ విమానాలు, ఆయుధ సామాగ్రిని భద్రపరిచేందుకు కాంక్రీట్ నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా యుద్ద విమానాలతో విన్యాసాలు చేసింది.

చైనాకు చెందిన అత్యాధునిక 20కిపైగా జె11, జె16 యుద్ధ విమానాలు విన్యాసాలు చేశాయి. లఢక్ సరిహద్దుల్లో చైనా నిర్మించిన వైమానిక స్థావరాల్లో ఈ యుద్ధ విన్యాసాలు సాగాయి.

చైనా వైమానిక విన్యాసాలతో భారత్ అప్రమత్తమైంది. డ్రాగన్ విన్యాసాలను గమనిస్తున్నామని భారత సైన్యం తెలిపింది. ఇక భారత వైమానిక దళం అప్రమత్తంగా ఉండాలని సైన్యం ఆదేశించింది.

గత ఏడాది కాలంగా తూర్పు లఢక్ ప్రాంతంపై చైనా కన్నేసింది. చైనా సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరిస్తూ రావడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య బాహాబాహీలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో ఇరుదేశాలకు చెందిన సైనికులు మృతి చెందారు. తూర్పు లఢక్ సరిహద్దుల నుంచి సైనికులను వెనక్కి తీసుకుంటూనే చైనా తన సరిహద్దులను ఆధునీకరిస్తూ వచ్చింది.