Begin typing your search above and press return to search.

డ్రాగన్ కు దిమ్మ తిరిగేలా మోడీ సర్కారు సరికొత్త షాక్

By:  Tupaki Desk   |   19 Sep 2020 6:15 AM GMT
డ్రాగన్ కు దిమ్మ తిరిగేలా మోడీ సర్కారు సరికొత్త షాక్
X
నాణ్యత అన్నది లేకుండా తక్కువ ధరకు ఇష్టం వచ్చినట్లుగా సరుకుల్ని డంప్ చేసే డ్రాగన్ దేశానికి మోడీ సర్కారు తాజాగా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. తాజాగా తీసుకున్న నిర్ణయం చైనాకు చెందిన పలు కంపెనీల ఆర్థిక ప్రయోజనాలు భారీగా ప్రభావితమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇంతకూ చైనాకు అంతలా ప్రభావితం చేసేలా మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది చూస్తే..

సరిహద్దుల దగ్గర డ్రాగన్ వేషాలకు సరైన రీతిలో చెక్ చెబుతున్న మోడీ సర్కారు.. తాజాగా చైనా నుంచి దేశానికి వచ్చే నాసిరకం వస్తువులకు చెక్ చెప్పేందుకు భారీ చెక్ పెట్టేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా ఎల్ ఈడీలను వినియోగించే రెండో దేశం భారత్? దీన్ని అవకాశంగా మార్చుకొని చైనా కంపెనీలు పలు నాసిరకం వస్తువుల్ని ఇండియాకు పంపుతున్నారు.

ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు వీలుగా.. చైనా నుంచి దేశంలోకి దిగుమతి అయ్యే అన్ని ఎల్ ఈడీలకు.. వాటి తయారీ పరికరాలు.. నమూనాలకు పరీక్షలు తప్పనిసరి చేశారు. దీంతో.. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఎల్ ఈడీ ఉత్పత్తికి కఠినమైన నాణ్యత పరీక్షలు నిర్వహించనున్నారు. భారత్ లో ఎల్ఈడీ మార్కెట్ చాలా పెద్దది. ఇప్పటివరకు నాణ్యత మీద పెద్దగా పట్టింపు లేని తీరుకు భిన్నంగా ఇకపై అన్ని ఉత్పత్తులకు వారం పాటు వివిధ పరీక్షలు నిర్వహించనున్నారు.

అన్నింట్లోనూ నాణ్యత సరిగా ఉందంటే వాటిని దేశంలోని అనుమతిస్తారు. ఒకవేళ ఏ ఒక్క పరీక్ష ఫెయిల్ అయినా.. సరుకును వెనక్కి పంపటమో లేదంటే అక్కడికక్కడే ఆ వస్తువుల్ని నాశనం చేస్తారు. అదే జరిగితే చైనా వ్యాపార సంస్థలకు భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలో మాదిరి చౌకబారు ఉత్పత్తుల్ని భారత్ లోకి డంప్ చేసే తీరుకు తాజా నిర్ణయంతో చెక్ పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.