Begin typing your search above and press return to search.

షాకింగ్ నిజం: ఆ రాష్ట్రాల్లో మగాళ్ల కంటే ఆడాళ్లకే ఎక్కువ లైంగిక సంబంధాలు!

By:  Tupaki Desk   |   20 Aug 2022 4:30 AM GMT
షాకింగ్ నిజం: ఆ రాష్ట్రాల్లో మగాళ్ల కంటే ఆడాళ్లకే ఎక్కువ లైంగిక సంబంధాలు!
X
విన్నంతనే నమ్మకపోవచ్చు. కానీ.. ఇప్పుడు చెబుతున్న వివరాలన్నీ ఏ ప్రైవేటు సంస్థ చేసిన సర్వేనో అయితే.. దీన్ని నమ్మే విషయంలో కొంత సందేహం ఉంటుంది. కానీ.. ఇప్పుడు మేం చెబుతున్న విషయాలన్ని కూడా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా బయటకు వచ్చిన అంశాలు. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో పలు వివాహేతర సంబంధాలకు సంబంధించిన విషయాలు బయటకు రావటం.. ఆ సందర్భంగా చోటు చేసుకునే క్రైం వార్తల గురించి తెలిసిందే. ఒకరికి తెలీకుండా మరొకరితో లైంగిక సంబంధాలు నడిపే పురుషుల గురించి వింటుంటాం. వారు పలు సందర్భాల్లో దొరికిపోవటం తెలిసిందే.

అయితే.. తాజా సర్వే నివేదిక చెప్పే షాకింగ్ నిజం ఏమంటే.. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు ఉన్న విషయాన్ని గుర్తించారు. మహిళలు.. పురుషుల లైంగిక జీవనానికి సంబంధించిన పలు వివరాల్ని తాజా నివేదిక బయటపెట్టింది. 2019-21 మధ్యలో దేశంలోని 28 రాష్ట్రాలు.. 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ఎఫ్ హెచ్ ఎస్ సర్వే నిర్వహించారు. ఇందులో రాజస్థాన్.. హర్యానా.. చండీగఢ్.. జమ్ముకశ్మీర్.. మధ్యప్రదేశ్.. కేరళ.. అసోం.. లక్ష ద్వీప్.. పాండిచెర్రీ.. తమిళనాడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు తమ జీవితకాలంలో ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్న విషయాన్ని సర్వే వెల్లడించింది.

రాజస్థాన్ లో సగటున ఒక మహిళ 3.1 మందితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే.. పురుషులు 1.8 మందితో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే పురుషులు.. స్త్రీల లైంగిక భాగస్వామ్యాల రేటు అధికంగా ఉండటం గమనార్హం.

పట్టణ పరాంతాల్లో ఒక పురుషుడు 1.7 మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటే.. స్త్రీలు 1.5 మందిలో శారీరక బంధాన్ని కొనసాగిస్తోంది. దేశ వ్యాప్తంగా 707 జిల్లాల్లోని 1.1 లక్షల మంది మహిళలు.. లక్ష మంది పురుషులపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేయగా ఈ విషయాలు బయటకు వచ్చాయి.

గత ఏడాది ఇద్దరు అంతకంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్న పురుషులు 1.2 శాతం మంది కాగా.. జీవిత కాలంలో 2.1 మందితో లైంగిక సంబంధాల్ని కలిగి ఉన్నట్లుగా సర్వే వెల్లడించింది. అదే విధంగా గత ఏడాది ఇద్దరు లేదంటే అంతకంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్న స్త్రీల సంఖ్య 0.3 శాతం కాగా.. వారి లైఫ్ టైంలో సెక్సు పార్టనర్ల సంఖ్య 1.7గా ఉండటం గమనార్హం. దేశ వ్యాప్త గణాంకాలు ఇలా ఉంటే.. మరి తెలుగు రాష్ట్రాల మాటేమిటి? అన్న విషయంలోకి వెళితే.. పలు సంగతులు తెలుస్తాయి.

ఏపీలో గత ఏడాది ఇద్దరు కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగిన మహిళలు 0.1 శాతం అయితే.. పురుషులు మాత్రం 1.2 శాతంగా ఉన్నారు. తెలంగాణలో మాత్రం ఇద్దరు కంటే ఎక్కువ మందితో శారీరక సంబందాలు కలిగి ఉన్న మహిళలు 0.4 శాతం కాగా.. పురుషుల్లో ఇది 2.1 శాతంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.