Begin typing your search above and press return to search.

నడిరోడ్డుపై యువకుల ఘర్షణ.. కారు ఢీకొట్టినా ఆపలేదు.. వైరల్ వీడియో

By:  Tupaki Desk   |   22 Sep 2022 3:31 PM GMT
నడిరోడ్డుపై యువకుల ఘర్షణ.. కారు ఢీకొట్టినా ఆపలేదు.. వైరల్ వీడియో
X
ఈ మధ్య గల్లీలల్లో ఆధిపత్యపు పోరాటాలు ఎక్కువయ్యాయి. విద్యార్థులు గుంపులుగా మారి తన్నుకు చస్తున్నారు. గ్రూపులు, కొట్లాటలు వీధుల వరకే కాదు.. రోడ్డు మీదకు వస్తున్నాయి. నడిరోడ్డుపై వాహనాలు వెళుతుండగా కొట్టుకునే వరకూ సాగుతున్నాయి. తాజాగా విద్యార్థులు భీకరంగా కొట్టుకున్నారు.ఇద్దరిని కారు గుద్దేసినా కూడా ఈ ఫైటింగ్ ను ఆపకపోవడం గమనార్హం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ రేంజ్ లో జరిగిన ఈ ఫైటింగ్ ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

యువకుల మధ్య గొడవ పెద్దది అయ్యింది. ఇది చూసి కొందరు ఆపాలని చూసినా ఆ లొల్లి సద్దుమణగలేదు. చుట్టుపక్కల వారు వారించినా వెనక్కి తగ్గలేదు. చివరకు పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఈ గుంపు పారిపోయింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు అందరినీ భయపెట్టేలా ఉంది.

ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ లోని నడిరోడ్డు మీద కొందరు విద్యార్థులు గొడవపడుతున్నారు. ఇంతలో వేగంగా వస్తున్న కారు ఆ యువకుల్లో ఇద్దరినీ ఢీకొట్టింది. ఓ వ్యక్తి గాల్లో లేచి కారు బానెట్ మీద పడి కింద పడ్డాడు. అయినా ఫైటింగ్ ఆపలేదు. కింద పడ్డ యువకుడు లేచి మరీ గొడవను కంటిన్యూ చేశాడు. గొడవ ఎక్కువై ఒకరి మీద ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. స్థానికులు అడ్డుకున్నా వారిపై దాడికి ప్రయత్నించడంతో వెనక్కి వచ్చేశారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా.. వారు వెంటనే వచ్చారు.

పోలీసులను చూసిన యువకులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. కొందరు విద్యార్థులను మాత్రం పోలీసులు పట్టుకున్నారు. దొరికిన వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. మిగిలిన వారి కోసం ఆరాతీస్తున్నారు. అందరినీ తీసుకొచ్చి గొడవకు సంబంధించిన వివరాలు, దాడులపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భీకర ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.