Begin typing your search above and press return to search.

ఇండియాలో ఐఫోన్ లు 80% ఛార్జింగ్ వద్దే ఆగిపోతున్నాయి.. ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   26 Jun 2022 1:30 AM GMT
ఇండియాలో ఐఫోన్ లు 80% ఛార్జింగ్ వద్దే ఆగిపోతున్నాయి.. ఎందుకంటే..?
X
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లో ఆపిల్ బ్రాండ్ కు ఉండే క్రేజే వేరు. ఈ బ్రాండ్ ఉన్న గాడ్జెట్స్ వాడటాన్ని ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తారు. యాపిల్ ప్రొడక్ట్స్ వాడుతున్నామంటే.. ఫ్రెండ్స్ లో మనకు ఓ రేంజ్ హైప్ ఉంటుంది. కానీ ఐఫోన్ గురించి మీకు ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా..? అదేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేసేయండి..

యాపిల్ ప్రొడక్ట్స్.. అందులో ముఖ్యంగా ఐఫోన్ కు ఉండే క్రేజే వేరు. ప్రతి యువకుడు, యువతి ఈ ఫోన్ కొనాలని కల కంటుంటారు. యూత్ లో యాపిల్ ఫోన్ కు ఉన్న క్రేజే వేరు. అయితే ఈ ఫోన్ గురించి మీకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలుసా. అదేంటంటే.. సాధారణంగా ఏ ఫోన్ అయినా ఛార్జింగ్ 100 శాతం వరకు ఛార్జ్ అయ్యేలా ఉంటుంది. కానీ, కొన్ని యాపిల్ ఐఫోన్ల లో మాత్రం 80 శాతం మాత్రమే ఛార్జింగ్ లిమిట్ ఉంది. అది కూడా కేవలం భారతదేశంలో మాత్రమే.

అదేంటి.. కేవలం ఇండియాలోనే ఈ ఫీచర్ ఉండటమేంటి అనుకుంటున్నారా.. ఇది ఇన్ బిల్ట్ ఫీచర్ కాదు.. డీఫాల్ట్ ఫీచర్ అంతకన్నా కాదు. ఇండియాలో.. ముఖ్యంగా దిల్లీ వంటి ఉత్తర భారత్ లోని ప్రాంతాల్లో ఐఫోన్ వాడుతున్న వారికి ఈ ఏడాది సమ్మర్ లో ఐఫోన్ హీటింగ్ వార్నింగ్ ఇచ్చే ఉంటుంది. ఎందుకంటే బయట ఉష్ణోగ్రతలు ఆ రేంజ్ లో ఉన్నాయి మరి.

ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్న రోజుల్లో మీ ఐఫోన్ 100 శాతం కెపాసిటీకి ఛార్జింగ్ ఆగిపోయే ఛాన్స్ ఉంది. అలాంటి సమయాల్లో ఈ ఐఫోన్ బ్యాటరీ సమస్య ఎదురవుతుంది.ఫలితంగా యాపిల్ సాఫ్ట్‌వేర్ ట్వీక్‌లు బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్‌ను ప్రొటెక్ట్ చేసేందుకు ఛార్జింగ్ ప్రక్రియను ఆపివేస్తాయట..

‘మీ ఐఫోన్, ఐప్యాడ్ లేదా ఐపాడ్ టచ్ చాలా వేడిగా లేదా చల్లగా ఉండే ప్రదేశాల్లో ఐఫోన్ బ్యాటరీ లైఫ్ పొడిగించడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదో ఆ కంపెనీ వివరించింది. పరిసర ఉష్ణోగ్రత 0, 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే ఐఫోన్‌లు, ఎలాంటి ఛార్జింగ్ సమస్యలు లేకుండా పనిచేస్తాయని యాపిల్ తెలిపింది. తక్కువ లేదా అధిక-ఉష్ణోగ్రత పరిస్థితుల్లో మీ డివైజ్ ఉష్ణోగ్రతను నియంత్రించడమే అందుకు కారణం కావచ్చు.

ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఆపిల్ ప్రాడక్ట్స్ వినియోగిస్తే బ్యాటరీ లైఫ్ శాశ్వతంగా తగ్గిపోతుందని యాపిల్ కంపెనీ వివరించింది. మీ ఐఫోన్ పూర్తిగా ఛార్జ్ అవ్వడం లేదంటే ఫోన్ హీట్ ఎక్కిందని.. హీట్ తగ్గిన తర్వాత మళ్లీ నార్మల్ గా ఛార్జ్ అవుతుందని తెలిపింది. ఫోన్ ఛార్జింగ్ ను మరీ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పెట్టకుండా.. కాస్త చల్లని ప్రదేశాల్లో పెడితే ఈ సమస్య ఉండదని వెల్లడించింది. iPhone, iPod యూజర్లు తమ బ్యాటరీ యూనిట్ గురించి మరింత తెలుసుకోవడానికి సెట్టింగ్‌లలో బ్యాటరీ హెల్త్ కూడా చెక్ చేసుకుంటుండాలి.

మీరు ‘ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్’ ఫీచర్‌ని ఎనేబుల్ చేస్తే.. బ్యాటరీ లైఫ్ ప్రొటెక్ట్ చేసేందుకు 80 శాతం చార్జింగ్ మాత్రమే అవుతుంది. ఆ తర్వాత iPhone నెమ్మదిగా ఛార్జింగ్ అవుతుంది. యూజర్ల ఛార్జింగ్ అలవాట్లను కూడా iOS గమనిస్తుంటుందని కంపెనీ తెలిపింది. మీ ఐఫోన్ ఎక్కువ సమయం పాటు ఛార్జర్‌కి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ యాక్టివ్‌గా ఉంటుందని వివరిస్తుంది. ముఖ్యంగా, యూజర్ల ఛార్జింగ్ రొటీన్‌లకు సంబంధించిన డేటా మీ iPhoneలో మాత్రమే స్టోర్ అవుతుంది. డేటా బ్యాకప్‌లలో చేరదు. అంతేకాదు.. ఆ బ్యాటరీ బ్యాకప్ డేటా కంపెనీ తో కూడా షేర్ కాదని నివేదిక పేర్కొంది.