Begin typing your search above and press return to search.

బీసీసీఐకి 1000కోట్లు జరిమానా విధించండి: హైకోర్టులో పిటిషన్‌ , ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   4 May 2021 11:30 AM GMT
బీసీసీఐకి 1000కోట్లు జరిమానా విధించండి: హైకోర్టులో పిటిషన్‌ , ఎందుకంటే ?
X
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ను నిర్వహించిన బీసీసీఐకి రూ.1000కోట్ల జరిమానా విధించాలని బాంబే హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా భారత్‌ లో కరోనా మరణాలు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్‌ 2021ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బాంబే కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది.

విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్‌ ను నిర్వహించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బీసీసీఐకి రూ.1000కోట్ల ఫైన్‌ వేయాలని, అలాగే ఐపీఎల్‌ ద్వారా వచ్చే లాభాలను కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాలు, మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా కోసం ఉపయోగించేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇక డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జిఎస్ కులకర్ణి గురువారం ఈ విషయాన్ని విచారించడానికి అంగీకరించారు. మరి బాంబే హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఐపీఎల్ 14వ సీజ‌న్‌ ను బీసీసీఐ తాత్కాలికంగా రద్దు చేసింది. స‌న్‌ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్‌ లో వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్‌ అమిత్ మిశ్రా కూడా క‌రోనా బారిన ప‌డ‌టంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టోర్నీలో క‌రోనా బారిన ప‌డిన వాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇక తప్పనిసరి ప‌రిస్థితుల్లో లీగ్‌ ను స‌స్పెండ్‌ చేస్తున్న‌ట్లు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.ఢిల్లీ మైదానంలో సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కోల్‌కతా ఆటగాళ్లు వరణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌ లకు ఆదివారం చేసిన పరీక్షల్లో కరోనా నిర్ధరణ అయింది. బయో బబుల్‌లో కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ ఆటగాళ్లు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజా సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.