Begin typing your search above and press return to search.

రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కావాలా .. వాట్సాప్ అలా చేయండి !

By:  Tupaki Desk   |   22 April 2021 12:30 AM GMT
రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కావాలా .. వాట్సాప్  అలా చేయండి !
X
కరోనా సెకండ్ వేవ్ రూపంలో దేశంపై మరోసారి విరుచుకుపడుతుంది. కరోనా బారిన రోగులకు ఇంజక్షన్ చేయాల్సిన రెమ్‌ డెసివిర్‌ మార్కెట్ లో అందుబాటులో లేక రోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల హెటిరో కంపెనీ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే అందించాలని నిర్ణయించారు. హైదరాబాద్ కూకట్ ‌పల్లి వై జంక్షన్‌ వద్ద హెటిరో కంపెనీ ఔట్‌ లెట్‌ వద్ద విక్రయిస్తున్న రెమ్ ‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ను ఆన్‌ లైన్‌ ద్వారా మాత్రమే అందించాలని నిర్ణయించారు. ఔట్ ‌లెట్‌ వద్దకు ప్రజలు రావొద్దని వాట్సాప్‌ లో వివరాలిస్తే మందును ఎప్పుడు అందిస్తామో వారి ఫోన్‌ కే మెసేజ్‌ వస్తుందని తెలిపారు.

మంగళవారం కంపెనీ గేటు ముందు రెమ్‌డెసివిర్‌ కేవలం వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా మాత్రమే అనే బోర్డును ఏర్పాటు చేశారు.అయితే ఈ విషయం తెలియని రోగి బంధువులు కంపెనీ ఔట్‌లెట్‌ వద్దకు రావటంతో కూకట్‌పల్లి పోలీసులు బందోబస్తు నిర్వహించి ప్రజలకి సూచనలు అందజేసి వారిని పంపించివేశారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ కావాలి అంటే ఇలా మెసేజ్ చేస్తే సరిపోతుంది. హెటిరో రెమ్‌డెసివిర్ కావాల్సిన వారు నగరం పేరు, ఆస్పత్రి పేరు, ఐపీ నంబర్, రోగి పేరు, అటెండర్‌ పేరు, మొబైల్‌ నంబర్, ఇంజక్షన్ల సంఖ్య వివరాలను మొబైల్‌ నంబర్‌ 91338 96969కు వాట్సాప్‌ గానీ, మెసేజ్‌గానీ పంపించాలని , మందును ఎప్పుడు అందజేస్తామో వారి ఫోన్‌కే మెసేజ్‌ వస్తుందని అప్పుడు మాత్రమే వచ్చి తీసుకెళ్లాలని వెల్లడించారు.