Begin typing your search above and press return to search.

ఈ తీగ‌ క‌నిపిస్తే వ‌దలొద్దు.. సంజీవ‌నే!

By:  Tupaki Desk   |   16 Jun 2021 5:30 PM GMT
ఈ తీగ‌ క‌నిపిస్తే వ‌దలొద్దు.. సంజీవ‌నే!
X
మ‌న చుట్టూ ఎన్నో మొక్క‌లు క‌నిపిస్తుంటాయి.. మ‌రెన్నో తీగ‌లు పెరుగుతుంటాయి.. కానీ, వాటి ఉప‌యోగం మ‌న‌కు తెలియ‌దుకాబ‌ట్టి.. ఏవో పిచ్చి మొక్క‌లు, పిచ్చి తీగ‌లుగా భావిస్తుంటాం. అలాంటి వాటిల్లో ఒక‌టే తిప్ప‌తీగ‌. బీడు భూముల్లో.. రోడ్డుప‌క్క‌న‌.. ఎక్క‌ప‌డితే అక్క‌డ పెరిగే ఈ చెట్టు వ‌ల్ల ఆరోగ్యానికి ఎంత ఉప‌యోగ‌మో తెలిస్తే.. ఎవ్వ‌రూ వ‌దిలిపెట్ట‌రు. మ‌రి, ఉప‌యోగాలు ఏంట‌న్న‌ది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే.

ఈ చెట్టు ఆకులు, కాండం, వేర్లు ప్ర‌తీ పార్లు కూడా ఔష‌ధంగా ప‌నిచేస్తుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒక వంద మిల్లీ లీట‌ర్ల నీటిలో మూడునాలుగు తిప్ప ఆకులు వేసి మ‌రిగించాలి. ఆ నీరు మూడొంతులు ఆవిర‌య్యే వ‌ర‌కు వేడి చేయాలి. ఆ నీటిని వ‌డ‌క‌ట్టి ప్ర‌తిరోజూ ఉద‌యం, సాయంత్రం గోరువెచ్చ‌ని నీటిలో క‌లుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు.

ఇది రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతుంద‌ని జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు కూడా తొల‌గిస్తుంద‌ని సూచిస్తున్నారు. అదేవిధంగా.. ఆక‌లి పెంచుతుంద‌ని, ర‌క్తం శుద్ధి చేస్తుంద‌ని, వాత, పిత్త‌, క‌ఫ స‌మ‌స్య‌లు నివారిస్తుంద‌ని సూచిస్తున్నారు.

ప్ర‌త్యేకించి మ‌హిళ‌లకు ఎంతో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ట‌. మ‌హిళ‌లో రుతుస్రావం స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. రుత‌క్ర‌మం ఇబ్బంది పెడుతున్నా, గ‌ర్భ‌సంచి, అండాశ‌యాల్లో ఇన్ఫెక్ష‌న్ ఉన్నా.. వాట‌న్నింటినీ దూరం చేస్తుంద‌ట‌. మూత్రాశ‌య సంబంధింత స‌మ‌స్య‌లకు సైతం తిప్ప తీగ చెక్ పెడుతుంద‌ట‌. ఏ ర‌క‌మైన జ్వ‌రాల‌కైనా తిప్ప‌తీగ మంచి ఔష‌ధంగా ప‌నిచేస్తుంద‌ట‌. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే.. తిప్ప‌తీగ‌ను సంజీవ‌నితో పోల్చ‌వ‌చ్చ‌ని అంటున్నారు నిపుణులు.