దీక్ష కాదు.. కౌరవసభను తలపించిందట!

Tue Feb 12 2019 14:02:55 GMT+0530 (IST)

దేశ రాజధానిలో ఏపీ ముఖ్యమంత్రి చేపట్టిన ధర్మ పోరాట దీక్షను ఆకాశానికి ఎత్తేస్తూ పచ్చ మీడియా సంబరాల మీద సంబరాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సభను ఉద్దేశించి విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు హోదా మీద ఈ స్థాయిలో దీక్ష చేస్తున్న చంద్రబాబు.. నాలుగున్నరేళ్లుగా ఎందుకు కామ్ గా ఉన్నారన్న ప్రశ్నను సంధిస్తున్నారు.ఢిల్లీలో బాబు చేపట్టిన దీక్షకు భారీ ఎత్తున నేతలు హాజరు కావటం తెలిసిందే. అయితే.. దీనిపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. బాబు చేపట్టిన దీక్ష కౌరవ సభను తలపించిందన్న ఆయన.. ఆసక్తికర ట్వీట్ చేశారు.

చంద్రబాబుతో శకుని మాట్లాడిన దృశ్యం కనిపించిందని.. లక్ష్మణకుమారుడు కూడా దీక్ష వద్దకు వచ్చి వెళ్లారన్నారు. ధుర్యోదన మాత్రం ధర్మపోరాట దీక్ష సభకు హాజరుకాలేదన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షను ఉద్దేశించి.. అందులో పాల్గొన్న నేతల్ని విమర్శిస్తూ ఐవైఆర్ ట్వీట్లు చేశారు.