Begin typing your search above and press return to search.

టెకీలను దారుణంగా వాడేస్తున్న ఐటీ కంపెనీలు.. సంచలన విషయాలు లీక్

By:  Tupaki Desk   |   28 Sep 2022 11:30 PM GMT
టెకీలను దారుణంగా వాడేస్తున్న ఐటీ కంపెనీలు.. సంచలన విషయాలు లీక్
X
దేశంలో, విదేశాల్లో ఇప్పుడు అత్యధిక వేతనాలు పొందే జాబ్ ఏది అంటే అందరూ ‘ఐటీ జాబ్’ అనే చెబుతారు. లక్షలు, కోట్లలో వీరికి ప్యాకేజీలుంటాయి మరీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ కంపెనీల్లో మన టెకీలు పనిచేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. అయితే వీక్ డే రీసెర్చ్ ప్రకారం.. ఐటీ కంపెనీల కంటే స్టార్టప్ లు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు మంచివేతనాలు అందిస్తున్నట్టు షాకింగ్ విషయం బయటపడింది.

వీక్ డే దాదాపు 50వేల మంది ఇంజినీర్ల డేటాను విశ్లేషించింది ఈ మేరకు నిగ్గుతేల్చింది. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ప్రపంచ టెక్ కంపెనీలు సైతం తక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీల్లో టెక్కీలు ఏడాదికి పదుల లక్షల్లో వేతనాలు అందుకుంటున్నారు.

భారత టాప్ ఐటీ కంపెనీలైన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి వాటితో పోల్చితే షేర్ ఛాట్, క్రెడ్, మీషో, స్విగ్గి వంటి ఇతర స్టార్టప్ ల కోసం పనిచూస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు చాలా ఎక్కువ వార్షిక వేతనం పొందుతున్నట్టు వీక్ డే సర్వేలో తేలింది. ఇందులో అత్యధికంగా ‘షేర్ చాట్’ మిడ్ లెవల్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు అత్యధికంగా వేతనాలు చెల్లిస్తున్నట్టు తేలింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ సుమారు 4 ఏళ్ల అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు వార్షిక ప్యాకేజ్ కింద రూ.47 లక్షలు చెల్లిస్తోంది. క్రెడ్, మీషో ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అనుభవం ఉన్న టెకీలకు ఈ కంపెనీలు ఏకంగా రూ.40 లక్షల వరకూ చెల్లిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ కంపెనీల కంటే కూడా ఈ వేతనం డబుల్ కావడం గమనార్హం.

ఇదే 4 ఏళ్లు అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి సర్వీస్ ఆధారిత సంప్రదాయ ఐటీ కంపెనీలు ఏడాదికి రూ.10లక్షలు చెల్లిస్తున్నాయి. ఈ పెద్ద ఐటీ కంపెనీలు అందించే ప్రారంభ జీతం ఏడాదికి కేవలం రూ.7 లక్షలుగా ఉంటోంది. ఇది కూడా స్టార్టప్ లు అందించే దానికంటే కూడా చాలా తక్కువ. బైజూస్, ఫ్రెష్ వర్క్స్ , క్వికర్, షాప్ క్లూస్ వంటి కంపెనీలు తమ ఇంజినీర్లకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయి. ఇక జొమాటో, పేటీఎం, ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలు అదే స్థాయి అనుభవం ఉన్నవారికి రూ.32 లక్షల వరకూ వేతనాలు ఇస్తున్నాయి.

ఇక ఐటీ కంపెనీల్లో మంచి ప్యాకేజీ రాగానే పెద్ద కంపెనీలకు టెకీలు ఎగిరిపోతున్నారు. కానీ స్టార్టప్ కంపెనీల్లో సగటు ఉద్యోగి పనిచేస్తున్న కాలం చాలా ఎక్కువ కావడం విశేషం. చాలా మంది జీతం కేవలం 10శాతం హైక్ ఇస్తే చాలు కంపెనీలను మార్చేస్తున్నారు. స్టార్టప్ లలో అయితే ఈ హైక్ ఏకంగా 50 నుంచి 70 శాతం పెంపు కనిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.