Begin typing your search above and press return to search.

బీజేపీ అటాక్: రాజస్థాన్ సీఎం సన్నిహితులపై ఐటీ దాడులు

By:  Tupaki Desk   |   13 July 2020 7:10 AM GMT
బీజేపీ అటాక్: రాజస్థాన్ సీఎం సన్నిహితులపై ఐటీ దాడులు
X
రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడానికి సిద్ధంగా ఉంది. సీఎం అశోక్ గెహ్లాట్ పై ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ యువనేత సచిన్ పైలెట్ తిరుగుబావుటా ఎగురవేశారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా మారింది. రాజస్థాన్ ను చేజిక్కించుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది.

సచిన్ పైలెట్ కు పోలీసులతో నోటీసులు పంపించిన ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ పై బీజేపీ దాడి మొదలుపెట్టింది. సోమవారం రాజస్థాన్ సీఎం సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపాయి.

సీఎం అశోక్ గెహ్లాట్ కు సన్నిహితులైన ధర్మేందర్ రాథోడ్, రాజీవ్ అరోరా అనే వ్యక్తుల నివాసాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీతోపాటు రాజస్థాన్ లోనూ ఆకస్మికంగా ఈ దాడులు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం 24 ప్రాంతాల్లో 200మంది అధికారులు వీటిని నిర్వహించారు.

ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి సీఎం అశోక్ గెహ్లాట్ భారీగా నగదును జమ చేస్తున్నాడనే ఆరోపణలతో ఈ దాడులు జరిగాయని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.