కరోనా తెచ్చిన ఈ మార్పును ఆహ్వానిద్దామా?

Tue Jul 07 2020 09:15:02 GMT+0530 (IST)

Should we welcome this change that Pandemic has brought?

కరోనా కాటేస్తోంది. ఆఫీసుల్లోకి వచ్చేసింది. అందుకే ఇప్పుడు అందరూ జపిస్తున్న మంత్రం ‘వర్క్ ఫ్రం హోమ్’. ప్రస్తుతం ఐటీ కంపెనీలు కొన్ని కంప్యూటర్ ఆధారిత సంస్థలన్నీ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయమంటున్నాయి.అయితే కరోనా భయంతో ఇప్పుడు ఏకంగా 70శాతం మంది ఉద్యోగులు ఇంటినుంచే పనిచేస్తున్నారు. ప్రపంచం.. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే దీనివల్ల కంపెనీలకు ఓ అడ్వంటేజ్ కూడా ఉంది. కంపెనీకి కార్యాలయం అక్కర్లేదు. దానికి అద్దెలు ఉండవు. కరెంట్ బిల్లులు ఉండవు. నిర్వహణ ఖర్చు ఉండదు.. తద్వారా లక్షలు మిగులుతాయి. దీంతో ఈ విధానమే ఐటీ కంపెనీల భవిష్యత్ పని విధానంగా మారుతుందేమోనని నిపుణులు అంచనావేస్తున్నారు.

ఖర్చులు భారీగా తగ్గుతున్న ఈ విధానాన్నే కొనసాగించేందుకు అన్ని కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని తాజాగా ‘వేక్ ఫిట్.కామ్’ సర్వేలో తేలింది. కరోనా తీవ్రతతో దాదాపు 79శాతంమంది ఐటీ ఉద్యోగులు ఆఫీసు కంటే ఇళ్లే నయం అని ఆప్షన్ ఎంచుకుంటున్నారట.. 57శాతం కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి అనుమతిస్తున్నాయట.. 70శాతం మంది ఉద్యోగులు పూర్తిగా వర్క్ ఫ్రం హోం లో ఐటీ కంపెనీలకు పనిచేస్తున్నారని సర్వే తేల్చింది. చాలా కంపెనీలు కరోనా తగ్గేవరకు ఇంటినుంచే పనిచేయాలని చెప్పేశాయట.

దాదాపు 59శాతం మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం చేయడం బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇంట్లో కుదురుగా పనిచేయలేకపోతున్నామని 39శాతం మంది ఐటీ ఉద్యోగులన్నారు. ఇంట్లోంచి పనిచేయడం వల్ల సరైన వసతులు లేక వెన్నునొప్పి సహా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని 76శాతం చెప్పారు.