Begin typing your search above and press return to search.

అరుదైన కేసు: కుమార్తెకు లింగమార్పిడి చేయించిన ఐపీఎస్ దంపతులు

By:  Tupaki Desk   |   29 Aug 2022 11:30 PM GMT
అరుదైన కేసు: కుమార్తెకు లింగమార్పిడి చేయించిన ఐపీఎస్ దంపతులు
X
సాధారణంగా సమాజంలో పురుషులుగా పుట్టి అమ్మాయి లక్షణాలుండే వారు ఎక్కువగా కనిపిస్తారు. వారంతా ట్రాన్స్ జెండర్ గా మారి పురుషాంగాలు అన్నీ శస్త్రచికిత్సతో తొలగించుకొని అమ్మాయిగా మారిపోతారు. చాలా అరుదుగా మాత్రమే అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా మారాలనుకునే వారు ఉంటారు. ఇప్పుడు ఒడిశా ఐపీఎస్ దంపతుల 22 ఏళ్ల కుమార్తె కూడా తల్లిదండ్రుల అనుమతితో విజయవంతంగా లింగమార్పిడి చికిత్స చేసుకొని పురుషుడిగా మారిపోయింది. ఇదో అరుదైన కేసుగా వైద్యులు అభివర్ణిస్తున్నారు.

ఢిల్లీలో సదురు యువతికి ఇటీవలే అపోలో వైద్యులు లింగమార్పిడి శస్త్రచికిత్స చేసినట్టు సమాచారం. అనంతరం డాక్యుమెంట్లు, పాస్ పోర్ట్ లోనూ జెండర్ మార్చే పనిని ఐపీఎస్ దంపతులు ప్రారంభించారు.

లింగమార్పిడి చేయించుకున్న 22 ఏళ్ల యువతి ప్రస్తుతం అమెరికాలో మేనేజ్ మెంట్ స్టడీస్ చేస్తోంది. ఆ యువతి తను పురుషుడిగా మారాలని.. లింగమార్పిడి చేయించుకుంటానని ఐపీఎస్ తల్లిదండ్రులను కోరింది. దీనికి తల్లిదండ్రులు ఓకే చెప్పి ఆపరేషన్ చేయించారు.

దీనిపై స్పందించాలని మీడియా సదురు ఐపీఎస్ దంపతులు.. యువతిని కోరగా నిరాకరించారు. ఇది మా ప్రైవేట్ విషయం కాబట్టి బయటకు చెప్పకూడదని స్పష్టం చేశారు.

ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి చెందిన కాస్మోటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మీకాంత మిశ్రా దీనిపై మాట్లాడారు. లింగమార్పిడి చికిత్సకు ముందు క్లినికల్ సైకాలజిస్ట్ తో కౌన్సిలింగ్, లీగల్ అఫిడవిట్ తప్పనిసరి అని అన్నారు. ఈ లింగమార్పిడి ఆపరేషన్ కోసం ప్లాస్టిక్ సర్జన్, గైనకాలజిస్ట్, ఎండో క్రైనాలజిస్ట్, సైకియాట్రిస్ట్ తో కూడిన వైద్యబృందం అంతా కలిసి చేస్తామన్నారు.

ఒక మహిళకు లింగమార్పిడి తర్వాత పురుష హార్మోన్లు అభివృద్ధి చెందడానికి కనీసం రెండేళ్లు పడుతుందని ఆ డాక్టర్ తెలిపారు. అయితే శరీరంలో మహిళఆ క్రోమోజోముల కారణంగా పురుషుల పట్ల ఆకర్షన మాత్రం ఉంటుందని..పురుషుడు మహిళగా మారడం ఈజీ అని... కానీ మహిళను పురుషుడిగా మార్చే ఆపరేషన్ చాలా సంక్లిష్టమని ఆపోలో వైద్యులు తెలిపారు. ఇలా మారడం చాలా అరుదుగా ఉంటుందన్నారు.

ఏడాదికి 9 మంది వరకూ పురుషులు.. మహిళలుగా మారుతారని..కానీ ఏడాదికి ఒక్కరే ఇలా మహిళ పురుషులుగా మారుతారన్నారు. 9 నెలల పాటు పురుషుడిగా మారేందుకు సమయం పడుతుందని.. గర్భాశయం , అండాశయం, రొమ్ములు, యోని కుహరం మూసేయడం.. పురుషాంగం నిర్మాణం పనిచేయడం ఏడాదిపైగా పడుతుందని వైద్యులు తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.