సజ్జనార్ ట్విటర్ అకౌంటన్ ను వదలని కేటుగాళ్లు

Tue Jan 24 2023 14:00:01 GMT+0530 (India Standard Time)

IPS Sajjanar's Twitter account hacked

సైబర్ నేరగాళ్లు మామూలు కేటుగాళ్లనే కాదు.. సామాన్యులనే కాదు.. ఏకంగా ఎన్ కౌంటర స్పెషలిస్ట్ అయిన స్టిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ లాంటి వాళ్లను వదల్లేదు. ఎక్కడో ఉండి ఆన్ లైన్ లో సైబర్ మోసాలకు పాల్పడే వాళ్లు తాజాగా సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేశారు. ప్రముఖ సంస్థలు సినీ రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేస్తున్నారు.ఆ ఖాతాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. నిన్న బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేయగా.. తన అకౌంట్ ద్వారా ఎవరైనా ఏదైనా పోస్ట్ పెడితే స్పందించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.తాజాగా టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ అకౌంట్ ను హ్యాక్ చేశారు. ఇక ఇదే విషయాన్ని టీఎస్ ఆర్టీసీ సంస్థ కూడా ధ్రువీకరించింది. ట్విటర్ అకౌంట్లను హ్యాక్ చేసి వాటి ద్వారా చాలామంది సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.

తాజాగా సజ్జనార్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ట్విటర్ హ్యాండిల్ ను మార్చారు. ఆర్టీసీ ఎండీ స్థానంలో ఫ్రాంక్లిన్ అని పేరు మార్చి డీపీ స్థానంలో కోతి ఎమోజీని పెట్టిన హ్యాక్ చేసిన అనంతరం వరుసగా పోస్టులు పెట్టారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు సోమవారం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్రిప్టో నగదుకు సంబంధించిన ట్వీట్ ఖాతా ద్వారా రీట్వీట్ చేశారు. ఈ ఖాతా ఎక్కువగా సైప్టోకరెన్సీ హ్యాకర్లచే హ్యాక్ చేయబడిందని తెలుస్తోంది.

ఈ ఘటన అనంతరం టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మీడియా ప్రకటన విడుదల చేస్తూ ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. హ్యాక్ చేయబడిన టీఎస్ఆర్టీసీ ఎండీ ఖాతా ద్వారా స్పందించారు.

“22.01.2023న 21:30 గంటలకు టీఎస్ ఆర్టీసీ ఎండీ (@tsrtcmdoffice) అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేశారు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. మేము మా హ్యాండిల్ నుండి ఎలాంటి ట్వీట్లను ఆమోదించము. సమస్యను పరిష్కరించడానికి మేము ట్విట్టర్ సపోర్ట్‌తో కలిసి పని చేస్తున్నాము” అని సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు.

అదే రోజు సోమవారం ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడింది. దానిపై హ్యాకర్లు అసభ్యకరమైన ఫోటోను పోస్ట్ చేశారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి.హెచ్.డి. ఈ ఖాతా 2019లో క్రియేట్ అయిందని 2020 ఫిబ్రవరి నుంచి అది పనిచేయడం లేదని సోమవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఖాతాను హ్యాక్ చేశారని దానిపై అభ్యంతరకరమైన ఫొటోను పోస్ట్ చేశారని పోలీస్ అధికారులు తెలిపారు.  ఇలా హ్యాకర్లు ప్రధానంగా పోలీస్ బాస్ ట్విటర్ ఖాతాలను టార్గెట్ చేయడం సంచలనమైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.