మరికాసేపట్లో ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. ఈ సంగతి గమనించారా?

Tue May 24 2022 17:00:01 GMT+0530 (IST)

IPL playoffs soon..

ఐపీఎల్ 15వ సీజన్ తుది అంకానికి చేరింది. ఈ రోజు రాత్రి 7.30కు తొలి ప్లే ఆఫ్స్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఓడిన జట్టు.. రెండో ప్లే ఆఫ్స్ విజేతతో ఎలిమినేటర్ లో తలపడుతుంది. కాగా నేటి తొలి ప్లే ఆఫ్స్ గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగనుంది. లీగ్ దశలో ఈ రెండు జట్లు 1 3 స్థానాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మరో ప్లే ఆఫ్స్ లో లక్నో సూపర్ జెయింట్స్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడనున్నాయి. ఈ జట్లు లీగ్ లో 2 4 స్థానాల్లో నిలిచాయి.చిత్రం చూశారా..?

ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో ప్రతి అంశమూ పరిశీలనకు గురవుతోంది. ఏదైనా ఒక విషయం లేదా సంఘటన తలెత్తితే సోషల్ మీడియాలో విచారణ చేసేంతగా పరిస్థితి ఉంది. ఉదాహరణకు ఈ సారి ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ చేరకుండా మిస్సయిన జట్లు ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కోల్ కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ సూపర్ కింగ్స్.

ఇక్కడే సోషల్ మీడియా ఫాలోవర్లు ఓ అంశాన్ని పట్టుకున్నారు. ప్లే ఆఫ్స్ చేరని జట్లన్నీ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన జట్లేనని ఓ పోస్ట్ ను ప్రచారంలోకి తెచ్చారు. కొంత ఆగి చూస్తే ఇది నిజమే కదా? అనిపిస్తోంది. అయితే ప్లే ఆఫ్స్ చేరిన వాటిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (కర్ణాటక) కూడా ఉంది. ఇది చిట్టచివరిగా ప్లే ఆఫ్స్ బెర్తు కొట్టేసింది. అయితే బెంగళూరు ఉన్నది కర్ణాటకలో. కర్ణాటకలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఆ విషయాన్ని ఎందుకనో సోషల్ మీడియా వ్యక్తులు విస్మరించారు. ఇక ప్లే ఆఫ్స్ గడప తొక్కిన మిగతా జట్లలో రాజస్థాన్ రాయల్స్ కూడా ఉంది.  ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.

వాస్తవంగా చూస్తే.. చెన్నై ముంబై కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరే జట్లు. కానీ ఈసారి చాలా దారుణ ప్రదర్శన చేశాయి. కోల్ కతా హైదరాబాద్ సగటు జట్లు.. వీటికి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎప్పుడూ సగంసగమే. ఇక ఢిల్లీ పంజాబ్ లది కనీస స్థాయి. లీగ్ లో ఎప్పుడూ ఇవి సంచలనాలు రేపింది లేదు. కాబట్టి సోషల్ మీడియా పోస్టును సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు. ఏదో సరదాకి.. వదిలిన పోస్ట్ గా పరిగణించాల్సి ఉంటుంది.

తొలిసారే.. ప్లే ఆఫ్స్ కు..

ఈసారి లీగ్ లో పది జట్లు ఆడిన సంగతి తెలిసిందే. వీటిలో లక్నో గుజరాత్ కొత్త జట్లు. అయితే చక్కటి ఆటతో ఇవి ప్లేఆఫ్స్ బెర్తు కొట్టేశాయి. పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచాయి. గుజరాత్ అయితే.. మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చింది. బ్యాటింగ్ లో టాప్ స్టార్స్ లేకున్నా.. బౌలింగ్ లో రషీద్ ఖాన్ తప్ప మెరికలు కనిపించకున్నా అదరగొట్టి టాప్ లో నిలిచింది.

కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును సమష్టిగా నడిపాడు. ప్రతి మ్యాచ్ లో ఎవరో ఒకరు విజయ సారథులుగా నిలిచారు. ఇక లక్నో ది కూడా సూపర్ ప్రస్థానమే. కేఎల్ రాహుల్ డికాక్ తప్ప పెద్దగా పేరున్న ఆటగాళ్లు లేకున్నా.. లక్నో రాణించింది. పేసర్ మొహిసిన్ ఖాన్ మంచి భవిష్యత్ ఉన్నవాడిగా పేరుతెచ్చుకున్నాడు.