పోలీసుల అండతోనే ఐపీఎల్ బెట్టింగ్‌లు? సీఐ అరెస్ట్‌తో డొంక కదులుతోంది!

Sun Nov 22 2020 18:41:20 GMT+0530 (IST)

IPL betting with the backing of the police? The curve is moving with the CI arrest!

ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంతో కామారెడ్డి జిల్లా  పోలీసులకు నిద్రపట్టడం లేదు. ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్న సమయంలో  బెట్టింగ్ రాయుళ్లకు సహకరించి  వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు పొందిన ఓ  సీఐ ఏసీబీకి చిక్కి విచారణ ఎదుర్కొంటుండగా ఈ వ్యవహారం ఇతర పోలీసు అధికారుల తలకు కూడా చుట్టుకుంది.జిల్లాలో జరిగిన ఐపీఎల్ బెట్టింగ్‌లో పోలీసుల పాత్ర ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఐపీఎల్ బెట్టింగ్ కేసులోని నిందితుడికి స్టేషన్‌బెయిల్ ఇచ్చేందుకు సీఐ జగదీశ్ రూ.5 లక్షలు లంచం తీసుకొని ఏసీబీకి పట్టుబడ్డాడు. దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో పలు కీలకవిషయాలు వెలుగుచూసినట్టు సమాచారం.

జిల్లాలో జరిగిన బెట్టింగ్‌లతో పలువురు డీఎస్పీలు ఎస్సైలకు సంబంధాలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే సీఐ జగదీశ్ అతడి సన్నిహితుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు తనిఖీచేస్తున్నారు. సీఐ అతడి సన్నిహితుల పాత్రపైనా ఏసీబీ అధికారులు ఆరాతీస్తున్నారు. అయితే బెట్టింగ్ రాయుళ్లకు పోలీసులకు మధ్య సుజయ్ అనే వ్యక్తి బ్రోకర్‌గా వ్యవహరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు బెట్టింగ్‌లో కామారెడ్డి డీఎస్పీ హ్యండ్ కూడా ఉన్నట్ట సమాచారం. అతడి ఇంట్లోనూ తనిఖీలు కొనసాగాయి. పలువురు కిందిస్థాయి అధికారులు ఎస్సైలు సీఐలు ఐపీఎల్ బెట్టింగ్‌లో పాలుపంచుకున్నట్టు సమాచారం. ఏసీబీ అదుపులో ఉన్న జగదీశ్ బెట్టింగ్‌పై పూర్తివివరాలు చెప్పాడు. దీంతో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీగా ఐపీఎల్ బెట్టింగ్ దందా సాగినట్టు సమాచారం. త్వరలో పూర్తివివరాలు తెలియనున్నాయి. ఈ సారి తెలుగురాష్ట్రాల్లో ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు బెట్టింగ్‌లో నష్టపోయి ప్రాణాలు తీసుకున్నారు.

తెలంగాణలో కూడా అనేక జిల్లాల్లో బెట్టింగ్ జోరుగా సాగింది.