ఐపీఎల్ నుండి వివో అవుట్ !

Tue Aug 04 2020 23:02:10 GMT+0530 (IST)

Vivo out from IPL!

ఐపీఎల్ స్పాన్సర్ గా కొనసాగుతున్న చైనాకి చెందిన మొబైల్ సంస్థ వివో .. ప్రస్తుతం భారత్ చైనా మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గాల్వానా ఘటన తర్వాత చైనా భారత్ మధ్య సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. ఇండియా చైనా పై ప్రతీకారం తీర్చుకునే భాగంలో డిజిటల్ స్ట్రైక్ చేస్తుంది. ఇప్పటికే 100 కి పైగా చైనా యాప్స్ ను భారత్ లో నిషేధించింది. తాజాగా ఈ రోజు కూడా మరో రెండు యాప్స్ ను నిషేధించింది. ఈ నేపధ్యంలో ఐపీఎల్ స్పాన్సర్ గా చైనా మొబైల్ సంస్థ వివో ను తప్పిస్తారు అని అందరూ భావించారు.కానీ భారీ మొత్తంలో స్పాన్సర్ షిప్ చేస్తుండటంతో ఇప్పటికిప్పుడు అంత పెద్ద మొత్తం స్పాన్సర్ ఎవరు చేస్తారు అని భావించి బీసీసీఐ వివో స్పాన్సర్ ను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వెల్లడించినప్పటి నుండి దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. వివో లేకుంటే ఐపీఎల్ నిర్వహించలేరా అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు తానుగా ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి వైదొలగాలని చైనా కంపెనీ ‘వీవో’ నిర్ణయించింది.

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులను వివో ఇండియా ఐదేళ్లకు గానూ 2017లో రూ. 2199 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రతీ లీగ్ లో రూ.440 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ గా ఈ చైనీస్ కంపెనీని కొనసాగించాలన్న బీసీసీఐ నిర్ణయం పట్ల పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా దీన్ని తీవ్రంగా విమర్శలు కురిపించారు. మొత్తంగా బీసీసీఐ ఐపీఎల్ కి కొత్త స్పాన్సర్ ను ఇప్పుడు వెతకాలి.