చైనా కంపెనీల స్పాన్సర్ షిప్ ఉంటే ఐపీఎల్ చూడటం ఆపేస్తారా ?

Mon Aug 03 2020 19:00:08 GMT+0530 (IST)

Will it stop watching IPL if it is sponsored by Chinese companies?

గత కొన్ని రోజులుగా క్రికెట్ అభిమానులని ఎంతాగానో ఊరిస్తున్న ఐపీఎల్ అప్డేట్ అయితే వచ్చింది. కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ కచ్చితంగా ఈ ఏడాది నిర్వహించి తీరుతాం అని బీసీసీఐ అధినేత గంగూలీ చెప్పినట్టే ఐపీఎల్ 2020 కి అన్ని అనుమతులు వచ్చాయి. సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ 13 వ సీజన్ మ్యాచులు యూఏఈ వేదికగా జరగబోతున్నాయి. అయితే.. తాజాగా బాయ్ కాట్ ఐపీఎల్ అనే నినాదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి.. చైనీస్ కంపెనీలను తొలగించకపోవడమే. గతంలో ఒప్పందాలు చేసుకున్న చైనీస్ కంపెనీల స్పాన్సర్ షిప్ లన్నింటినీ కొనసాగించాని ఐపీఎల్ గవర్నింగ్ ప్యానెల్ కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో.. ఐపీఎల్ టైటిల్ వీవో ఐపీఎల్ గానే కొనసాగనుంది. ఈ వార్త సోషల్ మీడియా దేశభక్తులకు చాలా ఆగ్రహం తెప్పించింది. ఎందుకు అంటే గత కొద్దిరోజుల క్రితం ..గాల్వానా లోయ వద్ద జరిగిన గొడవలో20 మంది భారత జవాన్లని పొట్టనపెట్టుకుంది. దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చైనా కి చెందిన 59 యాప్స్ ను ఆ తరువాత మరి కొన్ని యాప్స్ ను నిషేధించింది. దీనితో టైటిల్ స్పాన్సర్ షిప్ ను వివో ను కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడంతో బాయ్ కాట్ ఐపీఎల్ నినాదాన్ని ట్రెండింగ్ చేస్తున్నారు. ఐపీఎల్ కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్. ప్రధానంగా స్పాన్సర్ షిప్ లే ఆదాయవనరు. ఫ్రాంచైజీలు పెద్ద ఎత్తున చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ముఖ్యంగా సెల్ ఫోన్ తయారీ కంపెనీలు స్పాన్సర్లుగా ఉన్నాయి. వాటిని బాయ్ కాట్ చేస్తే ఫ్రాంచైజీలకు తీవ్ర నష్టం వస్తుంది. దీనితో వాటిని తొలగించడానికి సాహసించలేకపోయారు. మొదటగా.. గల్వాన్ లోయ ఘర్షణ జరగినప్పుడు.. కల్నల్ సంతోష్ బాబు అమరుడైనప్పుడు.. చైనా కంపెనీల స్పాన్సర్‌షిప్‌లపై ఆలోచిస్తామని ఐపీఎల్ కీలక వ్యక్తులు ప్రకటించారు. కానీ అలాంటి ఆలోచన ఇప్పుడు విరమించుకున్నారు. ఇదే అభిమానుల ఆగ్రహానికి కారణం అవుతుంది. అయితే చైనా కంపెనీల స్పాన్సర్ షిప్ ఉన్నంత మాత్రాన ఐపీఎల్ చూడకుండా ఉంటారా అంటే ఖచ్చితంగా ఉండరు అని చెప్పవచ్చు. చైనా మొబైల్స్ ను బ్యాన్ చేయాలనీ చైనా మొబైల్స్ నుండి మెసేజ్ చేసేవారు. ఐపీఎల్ చూడకుండా ఉంటారు అని అనుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. రికార్డ్ స్థాయిలో ఐపీఎల్ ను చూస్తారు.