ఐపీఎల్ః ఆ మ్యాచ్ కూడా ఆగినట్టేనా?

Tue May 04 2021 10:30:39 GMT+0530 (IST)

IPL 2021 COVID Crisis

దేశం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. ఇప్పుడు ఐపీఎల్ టోర్నీకి సైతం ముచ్చెమటలు పట్టిస్తోంది. బయోబబుల్ ను చూసుకుని ధైర్యంగా ముందడుగు వేసిన ఆటగాళ్లు.. ప్రస్తుత పరిణామాలతో బెంబేలెత్తిపోతున్నారు. బీసీసీఐ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతోంది.ఇప్పటికే కోల్ కతా జట్టు ఆటగాళ్లు కొవిడ్ బారిన పడడంతో సోమవారం జరగాల్సిన కోల్ కతా-బెంగళూరు మ్యాచ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కొవిడ్ పాజిటివ్ గా తేలడంతో.. టీమ్ మొత్తం క్వారంటైన్లోకి వెళ్లిపోయింది. దీంతో.. బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో జరగాల్సిన మ్యాచ్ కూడా వాయిదా వేయనున్నట్టు తెలుస్తోంది.

ఈ వారంలో చెన్నై జట్టు మొత్తం 3 మ్యాచులు ఆడాల్సి ఉంది. దీంతో.. అవన్నీ వాయిదా పడ్డట్టేనా? అనే చర్చ జరుగుతోంది. కోల్ కతా చెన్నై జట్లను కొవిడ్ టచ్ చేయడంతో.. మిగిలిన జట్టు సభ్యుల్లోనూ ఆందోళన మొదలైంది. తమ పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ వీడిపోయిన నేపథ్యంలో.. మిగిలిన ఆటగాళ్లు కూడా అదే తరహా ఆలోచనలు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.