Begin typing your search above and press return to search.

విద్యార్థిని స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఐఐటీ మద్రాస్ ప్రాజెక్టు ఉద్యోగి అరెస్ట్

By:  Tupaki Desk   |   20 Feb 2020 3:24 PM GMT
విద్యార్థిని స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఐఐటీ మద్రాస్ ప్రాజెక్టు ఉద్యోగి అరెస్ట్
X
మహిళా పీహెచ్‌ డీ స్కాలర్ ఒకరు వాష్‌ రూంలో ఉండగా వీడియో తీసేందుకు ప్రయత్నించిన ఐఐటీ మద్రాస్ ప్రాజెక్టు ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఆమె బాత్రూంలో స్నానం చేస్తున్నారు. ఆ సమయంలో ఎదురుగా కనిపించిన ఓ చిన్న రంధ్రం గుండా ఎవరో తనను వీడియో తీస్తున్నట్లుగా ఆమె గుర్తించారు.

ఆ వీడియో తీస్తోంది ప్రాజెక్టు ఆఫీసర్ శుభమ్ బెనర్జీగా ఆమె గుర్తించారని తెలుస్తోంది. ఆయన ఏరోస్పేస్ డిపార్టుమెంట్ ప్రాజెక్టు ఆఫీసర్‌ గా ఉన్నాడు. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్టు చేశారు.

నిందితుడైన ఉద్యోగి నుండి ఫోన్‌ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఎలాంటి వీడియో ఫుటేజీ లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో ఆ మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మీడియాలో వస్తున్న వార్తల మేరకు వాటర్ పైప్స్ వద్ద ఉన్న చిన్న రంధ్రం ద్వారా నిందితుడు గతకొంతకాలంగా ఫోటోలు - వీడియోలు తీస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు ఏడాది నుండి ఇలాంటి చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. కాగా, అరెస్టైన నిందితుడు బెయిల్ పైన విడుదలయ్యాడు.