Begin typing your search above and press return to search.

ఆయనకు ఎస్ బాస్ అంటున్నారుట...ఐఏఎస్ ఐపీఎస్ ల కొత్త పాట...?

By:  Tupaki Desk   |   30 Jan 2023 2:04 PM GMT
ఆయనకు ఎస్ బాస్ అంటున్నారుట...ఐఏఎస్ ఐపీఎస్ ల కొత్త పాట...?
X
రాజకీయం ఎపుడూ ఎన్నికలకు చివరి ఏడాదిలోనే మారుతుంది. వారు వీరు అవుతారు. అంతదాకా సజావుగా సాగే పాలన కానీ మరేది కానీ మరో రూటు తీసుకుంటుంది. పాలకులు ఎవరైనా నడిపించేది ఐఏఎస్ ఐపీఎస్ లే. వారే ప్రభుత్వ రధ సారధులు. కీలక స్థానాలలో వారు ఉంటారు. చక్రం తిప్పుతారు. అలాంటి వారిలో కొందరు రాజకీయ ప్రాపకం కోసం విధేయతను అటూ ఇటూ మారుస్తూంటారు. ఇపుడు ఏపీలో అలాంటిదే ఒకటి జరుగుతోంది అని అంటున్నారు.

అదేంటి అంటే కీలక అధికారులైన కొందరు ఐపీఎస్, ఐఏఎసు హైదరాబాద్ లో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు అని ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తా కధనం వచ్చింది. అది ఇపుడు తెగ వైరల్ అవుతోంది. ఆ మీడియా కధనం ప్రకారం చూస్తే హైదరాబాద్ కేంద్రంలో కీలక అధికారులు కొందరు తమ రాజకీయ విధేయతను ఒక్కసారిగా ఓవర్ నైట్ మార్చుకోవడానికి చూస్తున్నారుట. మరి వారికి ఏపీలో గాలి మార్పు ఏమైనా తెలిసిందా. జనాల పల్స్ వారికి అర్ధం అయ్యాయా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.

కీలకమైన అధికారులలో ఐపీఎస్ కి చెందిన వారు కూడా కొందరు ఉన్నారు అని అంటున్నారు. మరి వారి వద్దనే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. మరి ఆ వ్యవస్థ ద్వారా ఎప్పటికపుడు జనాల మూడ్ మీద సర్వేలు ఉంటాయి. మరి అలా చేసిన సర్వేలు ఏమైనా అధికార వైసీపీకి వ్యతిరేకంగా వచ్చాయా ఇక ఏపీలో అధికార మార్పిడి తప్పదని వారు డిసైడ్ అయ్యారా అన్నదే ఇపుడు వేడెక్కిస్తున్న విషయం. వీరంతా తమలో తాము సమావేశం పెట్టుకోవడమే కాదు తెలుగుదేశం అధినేత చంద్రబాబుని హైదరాబాద్ లో కలినట్లుగా ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

ప్రస్తుతానికి చూస్తే ఒక ఆరుగురు ఐఏఎస్ అధికారులు నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని చంద్రబాబుని హైదరాబాద్ లో కలిశారు అని అంటున్నారు. అదే రూట్లో మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా కలిశారని అంటున్నారు. వీరంతా బాబు ని కలసి తన విధేయతను చాటుకుంటున్నారని అంటున్నారు. మేమంతా మీకు అనుకూలమే అని ఒకటికి పదిమార్లు చెప్పుకుంటున్నారుట.

ఇలా వీరంతా రహస్యంగా చంద్రబాబుని కలుస్తున్నారు. ఇంకా చాలా మంది కలిసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు అని అంటున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక కొందరు ఐపీఎస్, ఐఏఏస్ అధికారులు లూప్ లైన్ లోకి నెట్టబడ్డారు వారు ఎటూ కొత్త ప్రభుత్వం వస్తే తమ ఫ్యూచర్ బాగుంటుంది అని భావించవచ్చు. కానీ వైసీపీ పెద్దలు ఆదరించి కీలకమైన ప్లేస్ లలో కూర్చోబెట్టిన వారిలో కూడా కొంతమంది ఆఫీసర్లు కూడా బాబు వద్దకు వెళ్ళి తమ విధేయతను చాటుకుంటున్నారు అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

తాము తెలుగుదేశానికి వ్యతిరేకం కాదని, వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగానే తాము చేయాల్సి వస్తోందని వారు సంజాయషీలు ఇస్తూ వాపోయినట్లుగా చెబుతున్నారు. అందువల్ల తాము అన్ని విధాలుగా నలిగిపోతున్నామని దయచేసి తమ బాధను అర్ధం చేసుకోవాలని వారు బాబుకు మొర పెట్టుకుంటున్నారు అని అంటున్నారు. ఇలా వీరంతా బాబు వద్దకు వెళ్ళి సంజాయిషీలు ఇచ్చుకుంటూ తమ గురించి మంచిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏపీలో 2024లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం అని కచ్చితంగా వారు అంచనా కడుతున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి.

మరి ఈ విధంగా ఐఏఎస్ ఐపీఎస్ లలో కొందరు కీలకమైన వారు బాబు తో సీక్రెట్ భేటీలు నిర్వహిచడం ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చిందో లేదో తెలియదు అని అంటున్నారు. ఒక వేళ వచ్చినా ఇపుడు ఏమీ చేయలేని పరిస్థితి అని అంటున్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో అధికారులు అయినా తొలి నాలుగేళ్ల పాటే చెప్పినట్లుగా చేస్తారు. చివరి ఏడాది మాత్రం తమ చిత్తం వచ్చినట్లుగా ఉంటారు. గాలి మార్పుని వారు గమనించారు అంటే అపుడు వారిని ఎవరూ ఏమీ చేయలేరు. అందువల్ల అన్నీ తెలిసినా మిన్నకుండి పోవడం తప్ప వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఏమీ చేయలేరు అని అంటున్నారు. ఏది ఏమైనా ఎస్ బాస్ అంటూ విధేయతను మార్చేసే అధికారులు ఎపుడూ పాలకులకు జవాబు లేని ప్రశ్నలుగానే ఉంటారని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.