Begin typing your search above and press return to search.

ఎక‌రానికి 30 వేలు ఇస్తా.. భూములు ఇవ్వండి: రైతుల‌కు సీఎం జ‌గ‌న్ విన‌తి

By:  Tupaki Desk   |   28 Sep 2022 11:43 AM GMT
ఎక‌రానికి 30 వేలు ఇస్తా.. భూములు ఇవ్వండి:  రైతుల‌కు సీఎం జ‌గ‌న్ విన‌తి
X
వరుసగా మూడో ఏడాది కూడా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని సీఎం జగన్ అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్‌కో సిమెంట్‌ పరిశ్ర మను ఆయన ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్రం దూసుకుపోతున్న విష‌యాన్ని ప్ర‌స్తావిం చారు. అన్ని రంగాల్లోనూ ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అత్యంత చేరువ చేసేందుకు తాము అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తున్నామ‌న్నారు.

పరిశ్రమలకు ప్రభుత్వం అన్నివిధాలా సాయపడుతుందని సీఎం జగన్ అన్నారు. వరుసగా మూడో ఏడా ది కూడా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రామ్‌కో పరిశ్రమతో స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని.. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయని సీఎం జగన్ అన్నారు.

"పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఒక పరిశ్రమ వచ్చిందంటే అనేక ప్రయోజనాలు వస్తాయి. రామ్‌కో పరిశ్రమతో స్థానికులకు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. పరిశ్రమలకు ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందిస్తోంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడో ఏడాది ప్రథమంగా ఉన్నాం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ప్రథమ స్థానంలో ఉంటున్నాం" అని సీఎం జగన్ అన్నారు.

రాయలసీమలో రైతులు ముందుకొస్తే.. ఎకరానికి 30 వేల రూపాయలు చెల్లించేలా సోలార్‌ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుందని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వమే ఈ భూములను లీజుకు తీసుకుని కంపెనీలకు ఇస్తుందని.. ఏటా 5 శాతం లీజు పెంచుతుందన్నారు. ఈ ప్రతిపాదనలకు రైతులను ఒప్పించేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సీఎం జగన్.. పిలుపు ఇచ్చారు. మ‌రి దీనిపై రైతులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.