తన ప్రెగ్నెన్సీకి కారణం చెప్పిన యువ ఆటగాడి మాజీ ప్రేయసి

Thu Oct 29 2020 11:00:56 GMT+0530 (IST)

I am Pregnant With Alexander Zverev Child

23 ఏళ్ల చిరు ప్రాయంలోనే టెన్నిస్ క్రీడాకారుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్. చిన్న వయసులోనే అతగాడు తండ్రి కాబోతున్నాడా? అంటే అవునని చెబుతోందిన అతగాడి మాజీ ప్రేయసి బ్రెండా. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. క్రీడా లోకంలో హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఏడాదిపాటు జ్వెరెవ్ తో సహజీవనం చేసింది అతగాడి మాజీ ప్రేయసి బ్రెండా. ఈ ఆగస్టు నుంచి వారు విడిపోయారు.తాజాగా తాను ఇరవై వారాల ప్రెగ్నెంట్ అని పేర్కొన్న ఆమె.. తన గర్భానికి కారణంగా తన మాజీ ప్రియుడు కమ్ క్రీడాకారుడు జ్వెరెవ్ గా స్పష్టం చేసింది. జ్వెరెవ్ కారణంగా తాను ఒక బిడ్డకు జన్మనివ్వనున్నట్లుగా చెప్పింది. లైఫ్ మీద తమకున్న భిన్నమైన ఆలోచనలతోనే తాము కలిసి ఉండలేదని స్పష్టం చేసింది.

పుట్టే బిడ్డను అతనికి ఇవ్వనని చెప్పిన బ్రెండా.. తానేసొంతంగా పెంచుతానని చెబుతోంది. బ్రెండా వయసు 27 ఏళ్లు అయితే.. ఈ జర్మనీ టెన్నిస్ ఆటగాడి వయసు 23 ఏళ్లు కావటం గమనార్హం. ఈ ఏడాది యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రన్నరప్ గా నిలిచిన ఈ టెన్నిస్ ఆటగాడికి మంచి భవిష్యత్తు ఉందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. తెర మీదకు వచ్చిన ఈ ఉదంతంపై అతడి మీద ప్రభావం చూపుతుందన్న మాట వినిపిస్తోంది. తన మాజీ ప్రేయసి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు అతగాడు స్పందించలేదు. ఆమె గర్భంపై అతడేం చెబుతాడన్న విషయంపై ఆసక్తి వ్యక్తమవుతోంది.