Begin typing your search above and press return to search.

దేశంలో తొలిసారి.. హైదరాబాద్ ఐటీ కుర్రాళ్ల సరికొత్త ప్రయోగం

By:  Tupaki Desk   |   19 Jun 2021 8:30 AM GMT
దేశంలో తొలిసారి.. హైదరాబాద్ ఐటీ కుర్రాళ్ల సరికొత్త ప్రయోగం
X
పాతికేళ్ల క్రితం ఇంటికి బాటిల్ లో మంచినీళ్లు తెచ్చుకొని తాగే ఆలోచన చేయటానికే నవ్వుకునే పరిస్థితి. ఇప్పుడు అంతా మారిపోయింది. ప్లాస్టిక్ బాటిళ్లలో బబుల్ తో వాటర్ తెప్పించుకోవటం.. తాగటం దగ్గర నుంచి వంట వరకు అన్నింటికి ఆ నీళ్లనే వాడే పరిస్థితి. అంతలా వాటర్ బాటిళ్లకు అలవాటైన పరిస్థితి ప్లాస్టిక్ బాటిళ్లతో పర్యావరణానికి కలిగే ముప్పును గ్రహించిన హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ఐటీ కుర్రాళ్లు(చైతన్య, సునీత్) వినూత్నంగా ఆలోచించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్ని వదిలేసి.. తాము అనుకున్నది పూర్తి చేయాలన్న పట్టుదలతో పని చేశారు. దేశంలో మరెక్కడా లేని రీతిలో మొదటిసారి ఈ కాన్సెప్టును సిద్ధం చేశారు.

కరోనా వేళ.. ప్లాస్టిక్ బాటిళ్లను సరిగా శుభ్రం చేయకుండా ఇంటికి రావటం ముప్పుగా భావించిన వారు.. వినూత్నమైన ప్లాన్ వేశారు. పేపర్ బాక్స్ లో మినరల్ వాటర్ సప్లై చేస్తే.. అది కూడా మరిన్ని మినరల్స్ ను యాడ్ చేసి అన్న కాన్సెప్టుపై పని చేశారు. దాదాపు రెండేళ్ల పాటు అధ్యయనం చేసి.. చివరకు అదరగొట్టే ప్లాన్ సిద్ధం చేశారు. తమ బ్రాండ్ కు ‘‘కారో’’ అనే పేరు పెట్టారు.

5..10..20 లీటర్ల మినరల్ వాటర్ ను పేపర్ బాక్సుల్లో పంపిణీ చేయటం షురూ చేశారు. ఇందుకు నగరంలోని కొన్ని గేటెడ్ కమ్యునిటీలను సంప్రదించి.. వారికి పంపిణీ చేయటం మొదలు పెట్టారు. వీరు ఉపయోగించే పేపర్ బాక్సుల్లో ప్లాస్టిక్ ఉన్నప్పటికి చాలా తక్కువగా ఉండటమే కాదు.. భూమిలో త్వరగా కలిసిపోయే గుణం ఉండేలా ప్లాన్ చేశారు. అంతేకాదు.. తాము సప్లై చేసే వాటర్ లో ఒక రోజులో మనిషికి అవసరమైన రాగిలో 20 శాతాన్ని తమ నీటిలో జోడించినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. గొంతు నొప్పిని పోగొట్టే ఆయుర్వేద గుణం ఉన్న ‘యష్టిమధు’ను జత చేశారు. ఈ కాంబినేషన్ లో మినరల్ వాటర్ ను దేశంలో తాము తప్పించి మరెవరూ ఇవ్వలేదని చెబుతున్నారు. మరి.. వీరికి ఆల్ ద బెస్టు చెబుదామా?