దయా హృదయుల సహాయం కోరుతున్న హైదరబాదీ కుటుంబం

Mon Aug 19 2019 20:00:00 GMT+0530 (IST)

Hyderabadi Druhil Parikh Family needing community support

దృహిల్ పారిక్ ప్రియమైన జ్ఞాపకాలతో...ఆగస్టు 12 2019న మా ప్రియమిత్రుడైన దృహిల్ పారిక్ (36 సంవత్సరాల వయసు రిచ్‌మండి వీఏలో నివాసం) కన్నుమూశారు. గత రెండు సంవత్సరాలకు పైగా దృహిల్ క్రానిక్ హెపటైటిస్ బి లివర్ సిరోసిస్ హెపటో సెల్యూలర్క్యాన్సర్ మరియు ట్యూబర్ క్యులోసిస్ వంటి పలు ఆరోగ్య సమస్యలతో పోరాటం చేస్తున్నారు. ఈ సమస్యలు ఆయన కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. శరీరంలోని ఇతర భాగాలకూ ఆరోగ్య సమస్యలు విస్తరించి... రోజురోజుకూ ఆయన్ను మృత్యువుకు చేరువ చేశాయి.

వర్ణించలేనంత తీవ్రస్థాయిలో నొప్పిని అనుభవించే స్థితికి దృహిల్ ఆరోగ్యం చేరింది. అలాంటి స్థితిలో కూడా ఆయన ప్రాణాలు కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున్నేపోరాటం చేశారు. అయితే చివరకు ఆయన తుది శ్వాస విడవాల్సివచ్చింది.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన దృహిల్ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. ఆయన తన బ్యాచిలర్ డిగ్రీని వాత్సల్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆండ్ టెక్నాలజీ భువనగిరిలో పూర్తి చేశారు. తన కలను నిజం చేసుకునేందుకు అనంతరం ఆయన అమెరికా వచ్చి సిటీ కాలేజ్ ఆఫ్ న్యూయార్క్ ఎన్‌వైసీలో ఎంఎస్ పూర్తి చేశారు.

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన దృహిల్‌కు కుటంబం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో తెలుసు. అందమైన కుటుంబాన్ని నిర్మించుకున్న ఆయన తన భార్య రుజుతను ప్రేమానురాగాలతో చూసుకున్నారు. వారికి నాలుగేళ్లకుమారుడు తక్ష్ ఉన్నాడు.

దృహిల్ ఆకస్మికంగా కన్నుమూయడం ఆ కుటుంబాన్ని షాక్‌కు గురిచేయడమే కాకుండా వారి సంతోషాన్ని ఆవిరి చేసింది. తన తండ్రి ఎందుకు మేలుకోలేకపోతున్నాడో తెలుసుకోలేని అమాయకుడైన కుమారుడు ఆ బుజ్జాయికితన తండ్రి తిరిగి రాలేడని ఏ విధంగా చెప్పాలో తెలియని స్థితిలో ఆయన భార్య ఉన్నారు.

తన తుదిశ్వాస విడవడానికి ముందు దృహిల్ తన స్నేహితులందరికీ చివరగా తన సందేశం పంపించారు. ``నా జీవితం ముగిసే సమయం ఆసన్నమైంది. మీ అందరినీ కలుసుకోవడం నాకెంతో సంతోషకరంగా ఉంది. మీరంతా

నాకుటుంబ సభ్యుల వలే మెదిలారు. నాకు మీతో మరింత సమయం గడపాలని ఆశగా ఉంది. కానీ...నా శరీరం అలసిపోయింది. మీ అందరికీ నేను ఆరాధిస్తున్నాను`` అని శోకతప్త హృదయాలతో పేర్కొన్నాడు.

దృహిల్ పరిచయస్తులు ఆయనతో అనుబంధాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తారు. అనేక కారణాలలో ఆయన్ను గొప్ప వ్యక్తిగా గుర్తించి ప్రశంసిస్తారు. కష్టకాలంలో గొప్ప ధైర్యంతో ఉండటం ప్రేమానురాగాలు స్వార్థం లేని గొప్ప గుణంవంటి వాటితో పాటుగా పేదలకు మరియు అవసరంలో ఉన్నవారికి తన వంతు సహాయం చేసేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయని ఆయన గుణం ప్రశంసలు పొందింది.

దృహిల్ మరియు రుజుత వ్యక్తిత్వం సహాయం కోరడానికి విరుద్ధమైంది. అందుకే మేమే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నాం. ఇప్పటికే అనేక మంది దృహిల్ కుటుంబానికి ఎలా సహాయం చేయాలని అడిగారు.దృహిల్ ఆరోగ్యం కోసం ఆస్పత్రిలో చేసిన ఖర్చు యొక్క పెండింగ్ బిల్లులు గత రెండు సంవత్సరాల కాలంలో వైద్య సేవలకు అయిన ఖర్చు వారి కుటుంబాన్ని అగమ్యగోచర స్థితికి నెట్టింది.

తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా దృహిల్ గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగం చేయలేదు. గతంలో గృహిణిగా ఉన్న ఆయన భార్య కుటుంబాన్ని నడిపించేందుకు చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేయడం ప్రారంభించింది.


ప్రస్తుత సంక్లిష్టమైన సమయంలో పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు మరియు అనిశ్చితిలో ఉన్న భవిష్యత్తుపై భరోసా కల్పించుకునేందుకు ఆ కుటుంబానికి ప్రస్తుతం భరోసా కావాలి.


దయచేసి ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆన్‌లైన్‌లో ఈ లింక్‌ల ద్వారా సహాయం చేయండి.


ఈ ఫండ్ (సహాయం ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండి) ద్వారా మనందరం సహాయం చేయడం ఆ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది.


సేకరించిన డబ్బు (సహాయం ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండి) ఆయన కుటుంబ అవసరాలకు మరియు ఇతరత్రా అంశాలకు సహాయపడేలా నేరుగా అందించబడతాయి.


ఈ పేజీ ద్వారా చిన్న మొత్తంలో చేసే సహాయం (దానం ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండి)  దృహిల్ కుటుంబ కష్టకాలంలో ఉన్న ప్రస్తుత సమయంలో వారిపై మీకున్న ప్రేమానురాగాలను చాటిచెప్తుంది.


మీ దయార్థ్ర హృదయానికి కృతజ్ఞతలు. ఆ కుటుంబానికి సహాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

 

ఇట్లు

దృహిల్ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు

 

Press release by: Indian Clicks LLC