Begin typing your search above and press return to search.

హైదరాబాద్ బ్రాండ్ ఏ పార్టీది - ఏ ప్రభుత్వానిది కాదు : మంత్రి కేటీఆర్!

By:  Tupaki Desk   |   22 Nov 2020 4:11 PM GMT
హైదరాబాద్ బ్రాండ్ ఏ పార్టీది - ఏ ప్రభుత్వానిది కాదు : మంత్రి కేటీఆర్!
X
హైదరాబాద్ బ్రాండ్ ఏ ఒక్క పార్టీది, ఏ ఒక్క ప్రభుత్వానిది కాదు అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రాంతం అని , హెచ్ ఐసిసి లో హైసియా ఆధ్వర్యంలో జరిగిన బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ హైదరాబాద్ ఆకర్షిస్తోందని, ఆరేళ్ల కింద హైదరాబాద్‌లో అనేక సమస్యలు ఉండేవన్నారు. హైదరాబాద్‌లో గొడవలు వద్దు అభివృద్ధి కావడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతీ బిడ్డ తెలంగాణ గడ్డకు చెందినవాడే అని సీఎం కేసీఆర్ ఆనాడే చెప్పారని మరోసారి తెలిపారు.

పెట్టుబడులకు అనుకూల ప్రాంతం హైదరాబాద్‌ అని , 2014తో పోలిస్తే ఐటీ ఎగుమతులు పెరిగాయని, గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఫేస్‌ బుక్‌ హైదరబాద్‌ లో పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. పెట్టుబడుదారులకు హైదరాబాద్‌ లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అమెజాన్‌ కంపెనీతో అనేక చర్చలు జరిపి వారికి నమ్మకాన్ని కల్పించామని కేటీఆర్‌ అన్నారు. విశ్వ నగరం అనేది కేవలం రోజుల్లో, నెలల్లో పూర్తి అయ్యేది కాదని, చాలా సంవత్సరాలు పడుతుందన్నారు. హైదరాబాద్ లో సమస్యలు ఉన్నాయన్న మాట నిజమేనన్నారు .వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. నాలాల అక్రమణ గతంలో జరిగింది ఇపుడు కూడా జరుగుతుందన్నారు.

తాగు నీటి సమస్య 90% తీరిందని, గతంలో 14 రోజులకు ఒకసారి వాటర్ వచ్చేవి. ఇపుడు డే బై డే వస్తున్నాయన్నారు. యిడా గజియాబాద్ లాంటి ప్రాంతాలు కాదని హైదరాబాద్ కు పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రశాంత వాతావరణంలో పరిపాలిస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరాన్ని అత్యన్నత స్థాయికి తీసుకెళ్లడనే తమ లక్ష్యం అని అన్నారు. బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమానికి హైసియా అధ్యక్షుడు మోడరేటర్‌గా వ్యవహరించారు.