Begin typing your search above and press return to search.

అమ్మాయిల అక్రమరవాణా, బలవంతపు వ్యభిచారం.. హైదరాబాద్​ కేంద్రంగా దందా

By:  Tupaki Desk   |   18 Oct 2020 12:10 PM GMT
అమ్మాయిల అక్రమరవాణా, బలవంతపు వ్యభిచారం.. హైదరాబాద్​ కేంద్రంగా దందా
X
బంగ్లాదేశ్​ నుంచి యువతులను అక్రమంగా తరలిస్తున్న ఓ ముఠా హైదరాబాద్​ కేంద్రంగా వ్యభిచార ముఠాను రన్​ చేస్తోంది. అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా కేసులను పరిశీలించిన ఎన్​ఐఏ (నేషనల్​ ఇన్విస్టేగేషన్​ ఏజెన్సీ) కి కీలక ఆధారాలు దొరికాయి. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ ఆదివారం స్పెషల్​ కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేసింది. బంగ్లాదేశ్ నుంచి యువతులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్​ఐఏకు అప్పగించగా.. కీలక ఆధారాలు బయటపడ్డాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. దీనిలో తొమ్మిది మంది బంగ్లాదేశీయులు కాగా మిగతావారు హైదరాబాద్​ వాసులు కావడం గమనార్హం.

ఎలా తీసుకొస్తున్నారు..

ఉద్యోగం కోసం వేచిచూస్తున్న బంగ్లాదేశ్​ యువతులను ఈ ముఠా టార్గెట్​ చేస్తోంది. హైదరాబాద్​లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పడవల్లో వీరిని కలకత్తా వద్ద సోన్‌ నది దాటించి కలకత్తా మీదుగా ముంబాయి, హైదరాబాద్ తరలించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. అనంతరం నకిలీ ఆధార్​ కార్డులు సృష్టిస్తున్నారు.

అయితే ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ తీసుకొస్తున్న ముఠా.. యువతులను నేరుగా వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు. వారిని గృహాల్లో బంధించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. మొదట పహడీషరీఫ్‌ పీఎస్​లో మహిళల అక్రమ రవాణాపై కేసు నమోదు అయ్యింది. ఆ తరువాత ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. జల్పల్లి ప్రాంతంలో వ్యభిచార గృహాల్లో ఉన్న నలుగురు బంగ్లా యువతులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారు ప్రస్తుతం హైదరాబాద్ షెల్టర్ హోమ్స్‌లో ఉంచారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్​లోని ఇంకా పలు వ్యభిచార గృహాల్లో బంగ్లాదేశ్​ యువతులు ఉన్నట్టు సమాచారం.