ట్రైన్ లో ట్రాప్ ...లాడ్జ్ లో రేప్ !

Mon Jan 20 2020 16:15:14 GMT+0530 (IST)

Hyderabad Rape Case

ఈ సమాజంలో మోసపోయే వారు ఉన్నంత కలం మోసం చేసేవారు సందుకోకరు పుట్టుకొస్తారు. ప్రతి రోజు బయట జరిగే ఘోరాలని చూసిన తరువాత కూడా పరిచయం లేని వారిని ఆలా గుడ్డిగా ఇలా నమ్ముతారో వారికే తెలియాలి. అలా పరిచయం లేని వారితో కొద్దిపాటి పరిచయంతోనే క్లోజ్ గా మూవ్ అయ్యి ..ఆ తరువాత మోసపోసపోయామని తెలుసుకొని భాధ పడేవారు సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా కొందరు కామాంధులు అమాయకమైన అమ్మాయిలని నమ్మకమైన మాటలతో ట్రాప్ చేసి ..శారీరకంగా వాడుకొని వదిలేస్తున్నారు. ఎన్ని చట్టాలు వస్తోన్న మహిళల పై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు.తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ట్రైన్ లో పరిచయం అయిన అమ్మాయిని ..తన ఫ్రెండ్ సహాయం తో లాడ్జ్ కి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి ...అక్కడి నుండి పారిపోయారు. మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడం తో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... పూజ అనే యువతి జాబ్ కోసం మహారాష్ట్ర నుంచి నగరానికి ట్రైన్లో వస్తుండగా మధ్యలో వివేకానంద అనే వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి తన ఫ్రెండ్ రాజుతో కలిసి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న శ్రీ కృష్ణ లాడ్జి కి తీసుకెల్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత చిన్నగా అక్కడి నుండి ఆ ఇద్దరు మృగాళ్లు జారుకున్నారు. ఆ సంఘటన నుండి కొద్ది సేపటి తరువాత తేరుకున్న యువతి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులపై సెక్షన్ 376 506 కింద కేసులు నమోదు చేసి వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.