Begin typing your search above and press return to search.

కొనేది వేల‌ల్లో.. అమ్మేది ల‌క్ష‌ల్లో: ‌హైద‌రాబాద్‌ లో డ‌్ర‌గ్స్ దందా క‌ల‌క‌లం!

By:  Tupaki Desk   |   16 July 2020 3:30 PM GMT
కొనేది వేల‌ల్లో.. అమ్మేది ల‌క్ష‌ల్లో: ‌హైద‌రాబాద్‌ లో డ‌్ర‌గ్స్ దందా క‌ల‌క‌లం!
X
నిషేధిత మ‌త్తు ప‌దార్థాల దందా హైద‌రాబాద్‌లో గుట్టుగా సాగుతోంది. ఆ నిషేధిత మ‌త్తు ప‌దార్థాలు అడ్డ‌దారిలో నగరంలోకి తీసుకొచ్చి విక్ర‌యిస్తూ భారీగా లాభాలు కొన్ని ముఠాలు పొందుతున్నాయి. తాజాగా మ‌రోసారి ఈ అక్ర‌మ డ్ర‌గ్ దందా హైద‌రాబాద్‌లో‌ కలకలం రేపింది. యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ దందాపై పోలీసుల విచారణ ముమ్మ‌రం చేశారు. హైద‌రాబాద్‌కు ఢిల్లీ, చెన్నై, గుజరాత్‌ల నుంచి అక్రమంగా డ్రగ్‌ను సరఫరా చేస్తున్న‌ట్లు గుర్తించారు. ఆ వాటిని రూ.30 వేలకు కొనుగోలు చేయ‌గా ముఠా ఆ డ్రగ్‌ను రూ.లక్షకు పైగా విక్ర‌యిస్తున్న‌ట్లు తేలింది. ఈ విధంగా త‌క్కువకు కొని అధిక ధ‌ర‌కు విక్ర‌యిస్తూ భారీగా అక్ర‌మంగా సంపాదించేస్తున్నారు.

యాంటీ వైరల్ మెడిసిన్ విక్రయం పేరిట ముఠా సభ్యులు విమానాల్లో ప్రయాణం చేస్తూ డ్ర‌గ్ స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. బ్లాక్ ‌ మార్కెట్‌లో కోవిడ్‌ డ్రగ్‌ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను మంగ‌ళ‌వారం పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ ముఠా సభ్యుడు గగన్‌ ఖురానాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం విచారించారు. ఈ విచార‌ణ‌లో పలు విషయాలు తెలిశాయ‌ని స‌మాచారం. హైద‌రాబాద్‌తో పాటు చెన్నైలో ఆక్ట్‌మ్రా, కోవిఫర్ మందులను ముఠా విక్ర‌యించింద‌ని గుర్తించారు. యాంటీ వైరల్ డ్రగ్స్ మాఫియా వెనకాల రెండు ప్రైవేట్ ఆస్పత్రుల హస్తం ఉన్నట్లు సమాచారం. వాటి వివ‌రాలు బ‌య‌ట‌కు తెలియ‌రాలేదు. దీంతో ఆ రెండు ప్రైవేట్‌ ఆస్పత్రుల వివ‌రాలు పోలీసులు రాబడుతున్నారు.

వైద్యుల పేరుపై కరోనా యాంటీవైరస్ డ్రగ్ తెప్పించి రూ.30 వేల విలువైన డ్రగ్‌ను రూ.లక్షా 20 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తెలిసింది. రూ.5 వేల విలువైన డ్రగ్‌ను రూ.50 వేలకు విక్ర‌యిస్తున్న‌ట్లు ముఠా స‌భ్యుడు వివ‌రించాడు. స‌ర‌ఫ‌రా చేయ‌డంతో ఆస్పత్రికి వచ్చిన డ్రగ్‌ను బ్రోకర్ల ద్వారా బ్లాక్ మార్కెట్‌లోకి య‌థేచ్ఛ‌గా విడుదల అవుతోంది. ఈ విష‌యం తెలిసి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అవాక్క‌య్యారు. వారిని అదుపులోకి తీసుకున్న స‌మ‌యంలో ముఠా సభ్యుల నుంచి రూ.35.5 లక్షల విలువ చేసే మ‌త్తు ప‌దార్థాలు స్వాధీనం చేసుకున్నారు.