పెళ్లాన్ని వదిలి.. ప్రియురాలి తో ఉన్న భర్త ను పట్టేసిన భార్య

Thu Oct 28 2021 12:00:24 GMT+0530 (IST)

Husband having an illicit affair with his girlfriend

పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లాం తో ఉండకుండా వేరే అమ్మాయి తో ఉండటానికి మించిన దారుణం ఇంకేం ఉండదు. ఒక వేళ.. పెళ్లాం తో పడటం లేదు. చట్ట బద్ధంగా విడాకులు తీసుకొని ఎవరి దారిన వాళ్లు ఉండటం మంచిదే. అందుకు భిన్నం గా పెళ్లి చేసుకొని పెళ్లాన్ని పట్టించుకోకుండా వేరే అమ్మాయి తో సన్నిహితం గా ఉండటం నైతికం గానే కాదు చట్టబద్ధం గా కూడా తప్పే అవుతుంది. అలాంటి పనే చేసిన ఒక ప్రబుద్ధుడి కి కాస్త గట్టి గానే షాకిచ్చిందో భార్యామణి. కుకట్ పల్లి హౌసింగ్ బోర్డు లో చోటు చేసుకున్న ఈ ఉదంతం తాజాగా షాకింగ్ గా మారింది.పెళ్లి చేసుకొని పట్టించుకోకుండా వేరే అమ్మాయి తో వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్న వైనాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటమే కాదు.. ఆగ్రహం తో తన వాళ్ల ముందు చితక బాదిన వైనం వెలుగు చూసింది. కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధి లో చోటు చేసుకున్న ఈ ఉదంతం లోకి వెళితే.. గుంటూరు జిల్లా పెద్దపరిమికి చెందిన ప్రకాశ్ కు.. అదే జిల్లాకు చెందిన త్రివేణికి 2019లో పెళ్లి జరిగింది. కట్నం గా భారీగానే ముట్టజెప్పారు.

బంజారాహిల్స్ లోని ఒక ఐటీ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంట్ గా పని చేస్తున్న ప్రకాశ్.. పెళ్లి తర్వాత నుంచి భార్యను హింసించేవాడు. వేధంపులకు గురి చేసేవాడు. కాపురం పెట్టాక కూడా ఇంటికి రాకుండా ఉండేవాడు. ఒకవేళ వచ్చినా ఏదో ఒకటి పెట్టుకొని ఇబ్బంది పెట్టేవాడు. తమ ప్రైవేటు ఫోటోల్ని స్నేహితులకు చూపిస్తున్న వైనం గురించి తెలుసుకున్న త్రివేణి తీవ్ర ఆవేదనకు గురయ్యేది.

ఇలాంటి సమయం లోనే తన భర్త కు వేరే అమ్మాయి తో వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని గుర్తించిన ఆమె.. తాజాగా తన కుటుంబ సభ్యుల తో కలిసి కేపీహెచ్ బీలోని తులసీనగర్ లో మరో అమ్మాయి తో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తన వాళ్ల ముందే ఆవేశం తో భర్తను చితకబాదింది. పోలీసులకు ఫిర్యాదు చేయటం తో ప్రకాష్ ను.. సదరు మహిళను అదుపు లోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ వ్యవహారం స్థానికం గా సంచలనంగా మారింది.