అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్

Fri Sep 30 2022 11:08:33 GMT+0530 (India Standard Time)

Hurricane ravages America

కొన్ని ఏళ్లలో అమెరికాను తాకిన అత్యంత ప్రమాదకరమైన తుఫానుగా 'ఇయాన్' నిలిచింది. ఇది అమెరికాలోని ఫ్లోరిడాను అతలాకుతలం చేసింది. ఫ్లోరిడాలో 2.4 మిలియన్ల గృహాలు వ్యాపారాలను విద్యుత్ లేకుండా చిమ్మిచీకట్లలో ముంచేసింది. వరద నీరు లోతట్టు ప్రాంతాలకు చేరుకుంది.హరికేన్ ఇయాన్ బుధవారం స్థానిక కాలమానం ప్రకారం దాదాపు మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో తీరాన్ని తాకింది గంటలకు 241  కి.మీల వేగంతో కూడిన  గాలులు వీచాయి. దీని ధాటికి ఇళ్లు కార్లు మనుషులు జంతువులు కూడా కొట్టుకుపోయాయి. సముద్రంలోని షార్క్ లు కూడా తుఫాన్ ధాటికి ఫోర్లిడాలోని ఇళ్ల మధ్య వరదల్లోకి వచ్చాయంటే ఎంత భారీ తుఫాన్ నో అర్థం చేసుకోవచ్చు.

ఈ భారీ గాలులకు అన్నీ కొట్టుకుపోయాయి. ఆసుపత్రి పైకప్పు ఎగిరిపోవడం కార్లు మునిగిపోవడం. నేల నుండి చెట్లు కూలడం చూశాం. నాలుగో కేటగిరీ హరికేన్.. ఉష్ణమండల తుఫానుగా మారింది.

ఫ్లోరిడా వాసులను అత్యంత ప్రమాదకరమైన తుఫాన్ వస్తుందని 24 గంటలు ముందే హెచ్చరించారు. టంపా మేయర్ ప్రజలను గురువారం ఉదయం వరకు రాత్రి వరకు వేరే చోట ఆశ్రయం పొందాలని కోరారు.ఎక్కువ వర్షం మరియు అధిక గాలులు వీస్తాయని.. అవి రాత్రంతా కొనసాగుతాయి అని మేయర్ బుధవారం సాయంత్రం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాడు.

హరికేన్ 'ఇయాన్' ఫ్లోరిడాలోకి విపరీతమైన శక్తితో వచ్చేసింది. ఇది మొత్తం విద్యుత్తు వ్యవస్థను కుప్పకూల్చింది. నివాసితులకు కరెంట్ లేకుండా అష్టకష్టాలు పడ్డారు. సముద్రపు నీటితో వీధులను ముంచెత్తాయి. రాష్ట్రం విపత్తు ప్రాంతంగా మారింది.

హరికేన్ ఇయాన్ బుధవారం ఫ్లోరిడాను తాకింది. అంతకుముందు మంగళవారం క్యూబాను కుదిపేసింది. ద్వీప దేశంలో గంటల తరబడి కరెంటు లేకుండా చేసింది.

తుపానుకు ముందు 2.5 మిలియన్లకు పైగా ప్రజలను ఖాళీ చేయమని ఆదేశించారు. హరికేన్ ఇయాన్ ఫ్లోరిడా ముంచేయడంతో గృహాలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వీధులన్నీ నీటితో నిండిపోయాయి.

సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన ఒక వీడియోలో ఫ్లోరిడాలోని ఫోర్ట్ మైయర్స్‌లో భారీ వర్షాల కారణంగా చెట్లు మరియు పవర్‌లైన్‌లు నేలకూలాయి. ఒక షార్క్ సముద్రం నుంచి వీధిలోకి కొట్టుకువచ్చి కనిపించింది..

ఇయాన్ హరికేన్ మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత ఫోర్ట్ మైయర్స్ నగరానికి పశ్చిమాన ఉన్న కాయో కోస్టా అనే అవరోధ ద్వీపంలో కేంద్రీకృతమైంది. దీని కారణంగా గంటకు 150 మైళ్ల (240 కిలోమీటర్లు) వేగంతో కూడిన గాలులు వీస్తున్నట్లు నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది.

తుఫాను గురువారం చివరి నాటికి అట్లాంటిక్ మహాసముద్రంలో ఉద్భవించే ముందు సెంట్రల్ ఫ్లోరిడా మీదుగా కదులుతుందని నివేదించింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.