Begin typing your search above and press return to search.

వందల మంది మోడల్స్ న్యూడ్ ఫొటో షూట్

By:  Tupaki Desk   |   18 Oct 2021 11:30 PM GMT
వందల మంది మోడల్స్ న్యూడ్ ఫొటో షూట్
X
ఒక మంచి పని కోసం మోడల్స్ అంత బట్టలిప్పి నగ్నంగా నిలబడ్డారు. దాన్ని ఫొటో షూట్ తీసి బయటపెట్టడంతో వైరల్ గా మారింది. 200 మంది మోడళ్లు ఒకే చోట ఉంటే చూడడానికి రెండు కళ్లు చాలవు.. అటువంటిది వారంతా నగ్నంగా ఫొటో షూట్ చేస్తే ఇక ఏమైనా ఉందా? అయితే నగ్నంగా వారంతా ఎందుకు చేశారు? అన్నది ఆసక్తిగా మారింది.

ఇజ్రాయెల్ లోని మృతసముద్రం వద్ద జరిగిన ఈ విశేషానికి పెద్ద కారణమే ఉంది. ప్రకృతి పరంగా జరిగే విపత్తులు కొన్ని అయితే మనిషి చేసే విధ్వంసాలు మరో పక్క అటువంటిదే జరిగింది మృతసముద్రం విషయంలో. తాజాగా ఇజ్రాయిల్ లోని మృతసముద్రం వద్ద 200 మంది మోడళ్లు నగ్నంగా ఫొటో షూట్ లో పాల్గొన్నారు. నగ్నంగా ఫొటో షూట్ లో పాల్గొన్నారు. మోడళ్లు అందరూ శరీరానికి తెల్లటి రంగు పులుముకొని ఫొటో షూట్ లో పాల్గొన్నారు.

ఇజ్రాయెల్ , స్విట్జర్లాండ్, బ్రిటన్, అమెరికాకు చెందిన 19 నుంచి 70 ఏళ్ల మహిళలు, పురుషులు ఈ నగ్న నిరసనలో పాల్గొన్నారు. ఇజ్రాయిల్ లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. అయితే డెడ్ సీ జలాలు అంతకంతకు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిపై అవగాహన కల్పించడానికే ఈ మోడళ్ల న్యూడ్ ఫొటో షూట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ిదీ. ఇజ్రాయిల్ పర్యాటక శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్పెన్సర్ ట్యూనిక్ అనే 54 ఏళ్ల ఫొటోగ్రాఫర్ ఈ ఫొటో షూట్ చేశారు.

ప్రతి సంవత్సరం ఈ నీటిని వాడుతుండడంతో డెడ్ సీ ఒక మీటర్ మేర ఎండిపోయింది. ఇజ్రాయిల్ , జోర్డాన్ లు ఎగువ ప్రాంతంలో నీటిని మళ్లించడంతో డెడ్ సీ ఎండిపోతున్న పరిస్థితి మరోవైపు మైనింగ్ కూడా సమస్యగా మారింది.

దీంతో ఈ పరిస్థితిపై అవగాహన కల్పించడానికి పర్యాటక శాఖ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక మృత సముద్రంలోని ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని పురస్కరించుకొని మోడళ్లు అంతా తెల్లరంగు పూసుకొని ఈ నిరసన తెలిపారు.