ఏలియన్స్ కు మనుషులకు యుద్దం.. మనుషులంతా పోయి ఏలియన్స్ రాజ్యం

Sat Jul 31 2021 14:06:51 GMT+0530 (IST)

War for humans to aliens

ప్రపంచం అతి త్వరలో అంతం కాబోతున్నదని ఇప్పటికే బోలెడు మంది జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. కాగా అవి ఉట్టుట్టి మాటలేనని చాలా మంది మేధావులు కొట్టిపారేశారు. అలా చెప్పే వారు ఎవరూ కూడా శాస్త్రీయమైన ఆధారాలను చూపించలేక పోతున్నారన్నది వారి వాదన.  వారి వాదన నిజమే కావొచ్చు. ఎందుకంటే ఆధారాలు లేనిదే దేనిని నమ్మొద్దు కదా.. అయితే తాజాగా ప్రపంచం అంతం గురించి ఓ వ్యక్తి జోస్యం చెప్పాడు. అతడి మాటలు కూడా ఎప్పటిలాగే ఇంతకు ముందు చెప్పిన వారి మాటల మాదిరిగా వైరల్ అవుతున్నాయి.



అతడి అంచనా ప్రకారం ప్రపంచం ఎప్పుడు అంతం కాబోతున్నది? ఇంతకీ అతడు భవిష్యత్తును ఎలా చూశాడు? ఏ టెక్నాలజీ ఉపయోగించాడు? భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉండబోతున్నది? వంటి తదితర విషయాలు తెలియాంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్గా రీడ్ చేయాల్సిందే. ప్రపంచం అంతం గురించి బోలెడు హాలీవుడ్ సినిమాలు వచ్చిన సంగతి అందరికీ విదితమే. కాగా అవి ఫిక్షనల్ స్టోరీస్ అని ఆయా చిత్రాల డైరెక్టర్స్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఎడ్వర్డ్ అనే వ్యక్తి వరల్డ్ అంతం గురించి చెప్పాడు.

భవిష్యత్తులోకి వెళ్లి మరీ చూశానని 5000వ సంవత్సరం వరకు తాను పయనించానని పేర్కొంటున్నాడు. అప్పటికి ప్రపంచమంతా నీట మునిగిందని ఎన్విరాన్మెంట్లో డ్రాస్టిక్ చేంజెస్ కనపించాయని వివరిస్తున్నాడు. భవిష్యత్తులోకి వెళ్లి తాను చూశానని తానే సృష్టి అంతానికి సాక్ష్యమని చెప్తున్నాడు. టైమ్ మిషన్ ద్వారా అంత దూరపు సంవత్సరానికి పయనించానని అంటున్నాడు. ఈ విషయాలన్నీ కూడా సదరు వ్యక్తి అపెక్స్ టీవీ అనే యూట్యూబ్ చానల్ ద్వారా వివరించాడు.

2004లో ఓ టాప్ సీక్రెట్ మిషన్లో భాగంగా 3వేల సంవత్సరాల ముందుకు వెళ్లానని పేర్కొన్నాడు. ఆ టైంలో లాస్ ఏంజిల్స్ సిటీ అంతా నీటిలో మునిగిపోయి ఉందని వివరించాడు. ఈ క్రమంలోనే భవిష్యత్ నుంచి తిరిగి మళ్లీ వెనక్కి వచ్చి ల్యాబరేటరీలో ఫొటగ్రఫిక్ ఇన్ఫరెన్స్ ద్వారా ఆ ఘటనలను వివరించే ప్రయత్నం చేస్తున్నాని పేర్కొంటున్నాడు. ఇందుకు టైం మిషన్లో పయనించినట్లు చెప్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన చెప్పిన వీడియో వైరల్ అయింది. తాజాగా మరోసారి తెరమీదకు వచ్చి చర్చనీయాంశమవుతోంది.

టైం ట్రావెల్ మెషిన్లో పయనించిన క్రమంలోనే తనకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయని చెప్తున్నాడు ఎడ్వర్డ్. ఫ్యూచర్ టైంలో పయనిస్తున్నపుడు తనకు చెక్క ప్లాట్ ఫాంలు కనిపించాయని తాను చెక్క మీదనే నిల్చొని ఉన్నానని భవంతులన్నీ చెక్కతోటి నిర్మించినవే కనిపించాయని వివరిస్తున్నాడు. మొత్తంగా అదో అద్భుతమని నీటి కిందనే చెక్కలతో కూడిన భవంతులున్నాయని చెప్తున్నాడు. అయితే టైం ట్రావెలర్స్ అంటూ పలు విషయాలు పేర్కొనడం కొత్తేం కాదు. గతంలోనూ కొందరు వ్యక్తులు ఇలాంటి వింత విషయాలను గురించి పేర్కొన్నారు.

భూమ్మీదకు గ్రహాంతరవాసులు వస్తాయని అవి మనుషులపై యుద్ధానికి దిగి మనుషులను చంపేస్తాయని తద్వారా వరల్డ్ అనేది ఏలియన్స్ రాజ్యంగా మారుతుందని చెప్పారు. కానీ ఇందుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలైతే లేవు. ఇవన్నీ ఫేక్ ముచ్చట్లేనని చాలా సైంటిఫిక్ స్టడీ ఆర్గనైజేషన్స్ కొట్టి పారేశాయి. ఇలాంటి వన్నీ ఫిక్షనల్ బుక్స్లో ఉండే అంశాలని వివరణ కూడా ఇచ్చాయి.  ఈ బుక్స్ ఆధారంగానే పలు సినిమాలు రూపొందాయి.