Begin typing your search above and press return to search.

చనిపోయినట్లు కలలొస్తున్నాయా? దేనికి సంకేతం?

By:  Tupaki Desk   |   1 Jun 2020 4:00 PM GMT
చనిపోయినట్లు కలలొస్తున్నాయా? దేనికి సంకేతం?
X
కొన్ని రకాల కలలు ఆనందాన్ని ఇచ్చేటివిగా ఉంటాయి. కొన్ని కలలు మనసుకు నిరాశను కలిగిస్తుంటాయి. ఇవ్వన్నీకూడా మనిషి ఆత్మతో సంబంధం ఉంటుంది. మనిషి నిద్రలోనున్నప్పుడు అతని శరీరం ఆత్మనుంచి వేరుపడుతుంది. ఎందుకంటే ఆత్మ ఎప్పటికీ నిద్రపోదు.

మనిషి నిద్రావస్థలో వున్నప్పుడు అతని పంచ జ్ఞానేంద్రియాలు కూడా తమ పనికి విశ్రాంతినిస్తాయి. ఇలాంటి సందర్భంలో మనిషి మస్తిష్కం పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్థితిలోనున్నప్పుడు మనిషికి ఓ రకమైన అనుభవం ఎదురవుతుంటుంది. అది వారి జీవితంతో కూడుకున్నదై ఉంటుంది. ఆ అనుభవాన్నే కల అని అంటారు.

ఈ కలల ఆధారంగానే మనిషి యొక్క భూత, భవిష్యత్, వర్తమానాలగురించి తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. తాజా పరిశోధన ప్రకారం మీ కలలు ఏం చెపుతున్నాయో వారు వివరణ ఇస్తున్నారు.

తరచూ మీరు చనిపోయినట్టు కలలు వస్తున్నాయా?ఇటువంటి కల వల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నారా? అందుకు భయపడాల్సి అవసరం లేదు. మీ జీవితంలో ఏదో నెగటివ్ గా జరగబోతుందని ఊహించుకుని మరింత ఆందోళన చెందుతుంటారు.

కలలు తరచూ కొన్ని భయాలను మరియు ఆందోళనలను కలిగిస్తుంటాయి. కలలో మీరు చనిపోయినట్లు వస్తే, మీరు మీజీవితంలో , జీవితానికి సంబంధించిన ప్రత్యక్షమైన మార్పులను చేసుకోవల్సి ఉంటుంది. చనిపోయినట్లు కలవస్తే భయపడాల్సిన అవసరం లేదో. తరచూ ఇదె కలలు వెంటాడుతుంటే,దీని అర్థ మేంటో తెలుసుకుందాం..

* మీరు చనిపోయినట్టు కల కంటే, మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు వస్తున్నాయని దాని అర్ధం. అంటే సింబాలిక్ గా చెప్పాలంటే, ఇది వ్యక్తి జీవితంలో ఏదో మంచి జరగబోతుందని అర్థం. మీ జీవితంలో ప్రయోగాత్మకంగా, అభద్రతగా చేయబోయే పనులు కాస్త భయానికి దారితీస్తుందని అర్థం. అందుకు కలత చెందాల్సిన అవసరం లేదు , ప్రమాధం జరగబోతుందని భయపడనవసరం లేదు. మీరు చేసే పనుల వల్ల మంచే జరగుతుంది, అయితే ప్రతి విషయంలో ఆత్రుత పనికిరాదు.

* మీరే స్వయంగా చనిపోయినట్టు కలవస్తుంటే సానుకూలంగా అభివృద్ధి చెందుతారని స్సష్టమైన గుర్తు.. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయి . గతాన్ని విడిచిపెట్టి, ఇక భవిష్యత్తుకు పూలబాట వేసుకుంటారని అర్థం. మరణం అనేది గడిచినపోయిన వాటిని మరిచిపోయి, కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రతికూలంగా ఉంటుంది. దీన్ని పునర్జన్మ అని కూడా అనుకోవచ్చు. మీరు మీ జీవితంలో సాధించాలనుకొన్నవి , మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి బలమైన వ్యక్తిగా మారబోతున్నారని అర్థం. మరణించినట్లు కల వస్తే మీ చెడు, హానికరమైన విషయాలన్నింటి వదిలేసి మంచి మార్గంలో నడుస్తారని సూచిస్తుంది.

* మరణించినట్లు కల వస్తే బహుశా మీ జీవితంలో ఊహించిన విధంగా మరికొన్ని బాధ్యతలను స్వీకరించాడానికి సిద్దపడమని సూచన.ఆ మార్పులు లేదా బాధ్యతలు నిజజీవితంలో మీ సంబంధ విషయంలో కావచ్చే, లేదా ఉద్యోగం విషయంలో కావచ్చు. అయితే ఈ మార్పు వల్ల అశాంతికి గురి అవుతారు. మరణం అంటే కోల్పోవడం, అది ప్రేమకావచ్చు, సంతోషం కావచ్చు, ప్రేరణ, ఉత్సాహం ఇలా ఏదైనా కోల్పోవచ్చు. అయితే అందుకు మీరుచేయాల్సింది, ఎలాంటి మార్పు సంభవించినా తెలివితో మార్పులు చేసుకోవడం వల్ల జీవితం సంతృప్తికరంగా ఉంటుంది