Begin typing your search above and press return to search.

శ్రీశైల క్షేత్రంలో భారీ కుంభకోణం ..కోట్లలో లూటీ!

By:  Tupaki Desk   |   25 May 2020 10:10 AM GMT
శ్రీశైల క్షేత్రంలో భారీ కుంభకోణం ..కోట్లలో లూటీ!
X
శ్రీశైలం క్షేత్రం... ఆ మహాశివుడు కొలువై ఉండే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఎంతో మహిమాన్విత జ్యోతిర్లింగం, శక్తి పీఠం శ్రీశైలంలో ఉంది. అంతటి ప్రాముఖ్యత గల ఈ ఆలయంలో తాజాగా భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

కొంతమంది అక్రమార్కులు భక్తుల సొమ్ములు కాజేశారు. 150 రూపాయల శీఘ్ర దర్శనం కౌంటర్లో రూ. కోటి కి పైగా మాయమైంది. 1500 అభిషేకం టికెట్లలో 50 లక్షలు మాయమయ్యాయి. డొనేషన్స్ కౌంటర్లలో కోటి రూపాయల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. వసతి సదుపాయం కౌంటర్లో 50 లక్షల అవినీతి జరిగింది. అలాగే టోల్ గేట్ పెట్రోల్ బంకుల నిర్వహణలో మరో రూ.40 లక్షలు, 500 రూపాయల టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్లలో మరో 50 లక్షల రూపాయలు దుర్వినియోగం జరిగింది.

భక్తుల సొమ్మును దారిమళ్లించడానికి అక్రమార్కులు ఏకంగా సాఫ్ట్‌వేర్‌ నే మార్చేశారు. అభియోగం తమ మీదికి రాకుండా సదరు అక్రమార్కులు టికెట్ కౌంటర్లలో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారు. అయితే.. ఒక్కొక్కటిగా అవినీతి బయట పడడంతో ఒకరిపై ఒకరు ఈవోకు పిటిషన్లు పెట్టుకున్నారు. ఒక్కొక్కదానిపై విచారణ చేయగా ..అసలు వ్యవహారం బయటపడింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయ ఈవో కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. ‘భారీ ఎత్తున అవినీతి జరిగింది వాస్తవమే. మొత్తం ఎంత జరిగింది అనేదానిపై ఇంకా పూర్తి నివేదిక రాలేదు.. రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నాం. ప్రభుత్వానికి కూడా నివేదిక తయారు చేస్తున్నాం’ అని తెలిపారు.